ఈ పుట ఆమోదించబడ్డది

దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి

1897

తెల్లగాణ్యశాఖీయ బ్రాహ్మణులు. తండ్రి: తమ్మనశాస్త్రి అను నామాంతరముగల వెంకటకృష్ణశాస్త్రి. జన్మస్థానము: చంద్రమపాలెము. నివాసము: పిఠాపురము, మదరాసు. జననము: 1897 సం. రచనలు: 1. కన్నీరు 2. కృష్ణపక్షము. 3. ప్రవాసము; ఊర్వశి. 4. ఋగ్వీధి. (ముద్రితములు) 1. మహతి (గేయ సంపుటి) 2. కార్తీకి 3. ఆకలి (జాతీయగీతములు) 4. బదరిక (పద్యము) 5. రేడియో నాటికలు 6. సుప్రియ (సాహిత్య వ్యాసములు - ఆముద్రితములు) మొదలగునవి.

నేటి కవిలోకమున కృష్ణశాస్త్రిగారి దొక ప్రత్యేక స్థానము. దేవులపల్లిసోదరులను పీఠికాపుర సంస్థాన విద్వత్కవులుగా వింటిమి. ఈజంటలో రెండవవారైన తమ్మనశాస్త్రిగారి కుమారుడీయన. తమ్మనశాస్త్రిగారి యసలుపేరు వేంకటకృష్ణశాస్త్రి. తండ్రికొడుకులపేరు లొకటే. నాడు తండ్రిపేరు కంటె, నేడు కొడుకుపేరు విన్నవారి జనసంఖ్య పెద్దది. కాని, తండ్రిముందు కొడుకు వ్యుత్పత్తిలో బేదవాడు. శివస్వరూపుడైన తమ్మనశాస్త్రి తేజస్సు ముందు కృష్ణశాస్త్రి కుమారమూర్తి. ఆయన కూర్చుండుటకు మేలిజాతి మణివితర్దిక కావలయును. ఇతనికి మెత్తని పూలపానుపుమీద గాని నిదుర పట్టదు.

కృష్ణశాస్త్రికి దొలుతొలుత పిఠాపురము హైస్కూలులో ఆంగ్లపు జదువు. నాడు కూచి నరసింహముగారి గురుత్వము కళార్థుల నెందఱనో భావకులనుగా దిద్దినది. ఆయన యంతేవాసియై యాంగ్ల కావ్య నాటకములోని మెలకువలు గుఱుతించి కృష్ణశాస్త్రి తన ప్రతిభకు మెఱుగు పెట్టుకొనెను. 'స్కూలుఫైనలు' వఱకు దండ్రితో నుండి