మొకటి మాత్రము, యీ యిద్దఱి కీర్తికిని పతాక. కలసి వ్రాసిన 'పౌలన్త్యహృదయ' మను చిన్న కావ్యమునుండియు రెండు రత్నముల నిచ్చి యిక జాలింతును.
[శ్రీరాముడు లంకపై నెత్తివచ్చుట చూచి సముద్రుడు రావణునితో జెప్పబోగా రావణు డనినమాటలు]
వసవల్చు చెక్కిళ్ళ వయనున లజ్జమై
ముని యాజ్ఞ దాటక తునుము సొగను
జునపాలువ్రేలు నీడున శైవచాపమ్ము
విఱిచిన శృంగార వీరమహిమ
పసపు బట్టల నిగ్గుపన భార్గవక్రోధ
సంధ్య మాయించిన శౌర్యసార
మాలి బాసిన క్రొత్త యలతమై వజ్రసా
రుని వాలి నొక కోల దునుము పటిమ
వింటియేకాని - ఇన్ని టికంటె రాచ
పట్టముదొరంగి నారలు గట్టి కాన
మెట్టినట్టి వెక్కసమైన దిట్టతనము
వింటి - సామికే తగుననుకొంటెకాని,-
శ్యామలకాంతి మోహనము, సౌమ్యగభీరము సుప్రసన్న రే
ఖామృదు హాసభానురము, గన్నులపండువునైన రాము నె
మ్మోమును మిమ్ముబోలె గన నోమను గాదె; కఠోరవృత్తినై
సామిని మున్నె ఘోరరణనత్రనిమంత్రితు జేసి యుంచుటన్.
____________