ఈ పుట ఆమోదించబడ్డది
గ్రుచ్చి తీసెద వెవ్వని కోర్కి పండ
జేయ నున్నావు తెల్పవే చిన్న దాన !
*
పత్తి చేను దున్నవలసి మంచిదినాన
మడకపూజ చేయ దొడగినపుడు
కోర్కు లాత్మ గుబులుకొన గడగడమని
వడక దొడగె గాపు చెడిపె కేలు.
*
కొండసెలయేటి సుడికి జిక్కుకొని కలగి
తిరుగుచును గేసరంబులు విఱిగిపోవ
కొంత మునుగుచు దేలుచుగొదమ తేటి
వెంట నంట గడిమిపూవు వెల్లబోయె.
*
అద్దమందు నీడ యంటున ట్లెవ్వని
యాత్మ నొరుల వగపు లంటుకొనవొ
అట్టివాని తోడ నెట్టు నెప్పుడు నత్త,
మనసు ప్రక్కలయిన మానె గాని.
*
పూని యూదెడు నెఱజాణ! ప్రొయ్యి మీద
నలుక గొన బోకు ; రక్త పాటల సుగంధ
మైన నీయూర్పు జవులకు నాసగొనుచు
పొగ లెగయు గాని మండ దీ ప్రొయ్యినగ్గి.
*
కనులు కానరాని కటికి చీకటిరేయి;
వలస! పోయె మగడు ; వట్టి యిల్లు ;