ఈ పుట ఆమోదించబడ్డది

లేడి సరసిన యపుడె ముద్దాడి కొనియె,

నహహ! యెంతటి ప్రేమార్ద్ర మామె మనసు.

'తృణకంకణము'

                *

ప్రియముతో బెంచి కొన్న తీవియలు కొన్ని

విషలత లటంచు దోచి నన్ బెరికి వైతొ?

పూలు పూయవొ? పరిమళంబులను విడవొ?

చూడ సుందరములు కావొ? సొగసులాడి!

'కష్టకమల'

                 *

నరనారీ సంబంధము

పరిభావింపుము దిశావిభాగము వరుసన్

ధర, జననీ భగినీ సహ

చరీ కుమారీ క్రమము నిజం బగుట సఖా!

'మాధురీదర్శనము'

                   *

తేనెమీద సుతారంపు ఠీవి నిలిచి

పగల బడి నవ్వు పువ్వుపై కెగయు అళిని;

ప్రియుడు ప్రియురాలి నట్లు చేర్చె నొక సుకవి,

బిడ్డ తల్లిని భాతి కల్పె మరొకండు.

'రమ్యాలోకము'

పవిత్ర ప్రేమతత్త్వమును గనుగొన్న రాయప్రోలుకవి ధన్యజీవి. ఈ కవిశేఖరునిలోని ఆధ్యాత్మికదృష్టికి అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రిగారి యనుగ్రహము పుష్టి నిచ్చినది. శాస్త్రిగారు సుబ్బారావుగారి మేనమామ. ఆబ్రహ్మణ్యుని పోలిక యీయనలో జాలభాగ మున్నది. మేనమామతో గలసి కొంతకాల మవధాన ప్రదర్శన యాత్రసాగించి, బుచ్చి