నోంకార శ్రుతితో నారాయణ రాయరచిత
గీతమునకు నా సహృదయసభ్యులెల్ల
తాళగతుల జతులతోడ మనోవీధి
తాముగూడ తాండవింప ఇదిగోనృత్యము
భారత భూమీ వాయన్య దిశా
ప్రచలిత ఝుంఝూ మారుత ప్రేరితంబై
భారభా రాలసంబై క్రూరదృక్ క్షోభితంబై
తధిగిణ తళంగ్
తళంగ్! తళంగ్! తళంగ్
*
ఇదిగో, ఇదిగో ప్రచండ తాండవ మిదిగో,
పాకీస్తాన్ - ద్రవిడస్తాన్
కొట్టేస్తాన్ - చంపేస్తాన్
ఖణిల్! ఖణిల్!
డమా! డాం.
ఈ యావేశము నవీన కవులలో నందఱికిని లభింపని యావేశము. నారాయణరావుగారికి దేశ మనగా భాష యనగా నెక్కడలేని యుత్సాహము పుట్టుకొని వచ్చును. వీరు వ్యావహారికభాషావాదులు. గిడుగువారి గురుత్వము. వ్యావహారికభాషలో రసవంతమైనట్టిదియు, జీవవంత మైనట్టిదియు నగు మార్గము గ్రంథరచనానుకూలమైనది యున్నదని నారాయణరావుగారు సనిదర్శనముగా జాటుచుందురు. ఈయన విమర్శనము మోమోటము లేకుండ సూటిగా బోవును. 'సజీవభాష' ను గూర్చినారాయణరావుగారు నిష్కరించి ప్రకటించిన యభిప్రాయమిది:-
"...సజీవభాషయనగా...జీవముతో కూడిన భాష. ప్రాకృత జనభాషితమైనభాష. ఆ ప్రాకృతజను డిప్పటివాడే కానక్కరలేదు. ఏనాటి