బృందారకాపగా మందభా బృందాని
కైలాస శైల రుగ్జాలకాని
మహనీయ సురమహీరుహ దీప్తిజాతాని
విపుల శుభ్రచ్ఛదోస్రపటలాని
వ్యాళనాయక గుచి చక్రవాళకాని
క బు నిస్పార రోభా దంబకాని
భువి విజిత్వావిరేజిరే తనయశాంసి
మారమదభంగ!కుక్కుటాకారలింగ!
ఏతద్ గ్రంథాంతగద్యమున "ఇది శ్రీమ త్కుక్కుటేశానుగ్రహ ప్రభూతకవిత్వ విశ్వామిత్ర గోత్ర పవిత్ర వారాణాసివంశపారా వార కైరపమిత్ర విద్వన్నుతచరిత్ర కామ యార్య పుత్ర సుకవి జనవిధేయ శ్రీ వేంకటేశ్వర నామధేయ ప్రణీతంబైన......" యనియున్నదిగాని, కృత్యాది పద్యములో నీగ్రంథనిర్మాణమునకు దనసోదరులైన లక్ష్మిపతి, జోగన్న యనువారులు తోడైరని కలదు. ఆపద్యమిది:
శా. ప్రీతింబుట్టితి మవ్వధూపగులకున్ శ్రీ వెంకటేశుండు నే
నేతద్ గ్రంథనిబంధనంబునకు నాకెంతేనియుం దోడుగా
జేతస్ఫూర్తి రచించి పొల్పెసగు లక్ష్మిసత్యభిఖ్యుండు వి
ఖ్యాతప్రజ్ణుడు జోగనాహ్వయుడు నార్యశ్లాఘ్యసంశీలతన్.
గ్రంథపీఠికాకారులు మల్లయ్యశాస్త్రిగా రీవిషయము గుఱుతించి యిటులు వ్రాయుచున్నారు.
"...ఇట్లున్ననునీగ్రామమున నున్న వారొకరు వీరు తమకు సన్నిహిత బంధువు లనియు, వీరిమువ్వుర నెఱుగుదు మనియు, వేంకటేశ్వరకవి దీనిని రచింపనారంభించి మిక్కిలి కొలదిభాగమును రచియించి యేకారణముచేతనో మాని తరువాత గొలదిదినములలో మృతిజెందెననియు బిమ్మట లక్ష్మీపతియే దీనిని సొంతముచేసి యన్న యందలిభక్తిచే నాయన