ఈ పుట ఆమోదించబడ్డది

పట్టణములలోనున్న అఖిలభారత రచయితల మహాసభలో బాలుగొని తెలుగు దేశభాష విశిష్టతయిట్టిదా! యనిపింప జేయునటులు మాటలాడినారు. ఆంధ్రరాష్ట్ర ప్రత్యేకతకై నడుముకట్టిపనిచేయు కర్మవీరులలో నారాయణరావుగారు నొకరు. ఆయనది వజ్రసంకల్పము. ఆయన కావించిన భాషా - వాజ్మయ చరిత్ర పరిశోధనము లనంతములు, ఆంధ్రవిశ్వవిద్యాలయము ప్రకటించిన రెండు పెద్ద సంపుటములలో నారాయణరావుగారి భాషాచరిత్రపరిశీలకత రూపము గట్టియున్నది. ఈ గ్రంథము రావుగారి సేవకు లక్ష్యమే కాకుండ, మనభాషకు మండనమును. ఈ గ్రంథములో గతానుగతికమైన విమర్శనము కాక, సొంతమైన పరిశ్రమము హెచ్చుగా నున్నది. అది కారణముగా నిట్టి కృతులు పెక్కుకాలము సమారాధన యోగ్యములు కాగలయవి. తెనుగునకు ద్రావిడ భాషా సంబంధమునుగుఱించి నెఱపిన 'కాల్ డ్వెల్‌' సిద్ధాంతమును గాదనుచు నారాయణరావుగారు చేసిన యమోఘ కృషికె వారి ఆంధ్రభాషాచరిత్ర' మేలిపంట. వీరి సిద్ధాంతములపై రాద్ధాంతములు వెలువడుచుండుటయు గమనించుచున్నాము. ఏమైనను, ఒకరి దారి ననుకరించుచు జేసిన విమర్శనముకంటె, స్వతంత్రుడై చేసిన విమర్శనము హృదయములకు హత్తుకొని నిలవగా నుండుటకును వీలగును. ఇట్టి స్వతంత్ర పరిశ్రమము నారాయణరావుగారిని వలచినది. వాజ్మయ చరిత్ర విషయములో నారాయణరావుగారి దారులు కొన్ని ప్రామాణిక ములు కావనుకొందురు. ఈ విషయమున నేను బొత్తిగా నజ్ఞడను.


చరిత్రపరిశోధన మొక బండపనియనియు, చరిత్రపరిశోధకుల హృదయములు రసార్దములు కావనియు ననుకొనుట పరిపాటి. అది నేటి కాలమున చాలభాగము తగ్గినది. శ్రీ ప్రభాకరశాస్త్రి, సోమశేఖరశర్మ ప్రభృతులు ఇరువైపుల వాడిగల పండితులు. నారాయణరావుగారిని గూర్చి యోచించినపుడు, వీరేశలింగముపంతులుగారు స్మర