ఈ ప్రకృతులు గల నవయామినీ-బిల్హణులతో నీ కావ్యము రెడ్డిగారు సంతరించిరి. కథానిర్మాణము ప్రకృతము మనము చూడవలదు. ఆయన కటులు తోచినది. పూర్వపు బిల్హణీయకథ యనౌచితీ దుష్టమని యాయన నమ్మినాడు. కాదుకాదని విమర్శకులు వాదములు చేయుచున్నారు. పోనీ! అందలి కవితావైభవమెట్లున్నది! ఈ ఖండకృతిలో మొత్తము ముప్పది పద్యములకంటె మించిలేవు. కాని, మంచి కండగల రచన.
పరవశుడగాక యిన్నేండ్లు బ్రతికి నేడు
నాకు నీవశంబగుట సంతనమ కాని;
కాఱుతప్పి, కాలము సెడి కర్షకుండు
విత్తు చల్లిన ఫలమున్నె? వెఱ్ఱిగాదె?
*
నీవు మనోజ్ఞ మూర్తివి, వినిర్మల కీర్తివి జ్ఞానమందు వి
ద్యా విభవంబునందు బరమాద్భుతశక్తిని ; నాకు జూడగా
దైవము, దండ్రియున్, గురువు,దల్లియు నీవ నఖుండవున్ సదా ;
కావున సాహసించితిని కర్మము ధర్మము పూని తెల్పగన్.
నీప్రతిబింబమగద నే
నో పావనమూర్తి, కినియనోపుదె నాపై
నీషోషించిన లతికను
నీపట్టున నలరనిమ్ము నిర్మల నియితిన్.
*
చిఱునవ్వు రేకుల జెన్నారు మొగము దా
మర సౌరభము మది కరగ నాని
కలికి తనము మీఱ దెలివి మెఱుంగుల
జెలగించు కనుల కాంతులకు దలరి