ఈ పుట ఆమోదించబడ్డది

వారణాసి వేంకటేశ్వరకవి

1820

వెలనాటి వైదిక బ్రాహ్మణుడు. ఆపస్తంబ సూత్రుడు. విశ్వామిత్రగోత్రుడు. తల్లి: లచ్చమాంబ. తండ్రి: కామయార్యుడు. గోదావరీ మండలములోని పీఠికాపుర ప్రాంతమున గల ' క్రొత్త యిసుకపల్లి ' ఈకవి నివాసమని చెప్పుదురు. 1850 ప్రాంతమున గ్రంథరచన గావించినటులు తెలియుచున్నది. జననము: 1820 ప్రాంతము. రచించిన గ్రంథము: రామచంద్రోపాఖ్యానము (ఆరాశ్వాసముల కావ్యము 1911 ముద్రితము.)

రామాయణములోని కథను సంక్షేపించి యాఱుకాండములకు నాఱు ఆశ్వాసములుగా 'రామచంద్రోపాఖ్యాన' మనుపేర గద్య పద్యాత్మకమగు కావ్యము రచించిన యీ వారణాసి వేంకటేశ్వరకవి సంస్కృతాంధ్రములలోఁ జక్కని ప్రవేశము కలిగి శివారాధకుడైన పండితుఁడు. ఈ గ్రంథమునకు శ్రీ పురాణపండ మల్లయ్యశాస్త్రి గారు పీఠిక వ్రాయుచు నీ వేంకటేశ్వరకవి నివాసము పీఠికాపురపరిసరమున వెలసిన క్రొత్త యిసుకపల్లి యనియు, దత్రత్యులవలన విన్నది విస్పష్ట పఱిచిరి. కూచిమంచి తిమ్మకవి వలెనే యితఁడు శివభక్తుఁడై యీ కృతి "శ్రీ పీఠాఖ్యపురీ మహేశ్వరుఁ" డగు కుక్కుటేశ్వరున కంకితము గావించెను. రామోపాఖ్యానము రచించి యీశ్వరున కిడుటలో నితని యద్వైత మతాభిమానము వెల్లివిరిసినది. సంస్కృత సీసములో నీ కవి రచించిన కుక్కుటేశస్తవము వినుఁడు.

సీ. శ్రీమ ద్వచోమానిసీ మహశ్చక్రాణి
నాకలోకేభ విభాకులాని
దుగ్ధపాథోధి సమ్యగ్ధామయాధాని
పుండరీక ప్రభామండలాని