ములు. జాతీయ కవితాశాఖనధిష్ఠించి కూసిన కలకంఠములలో విశ్వనాధకవి తొలివాఁడో, మలివాఁడో !
గోదావరీ పావనోదార వాఃపూర
మఖిల భారతము మాదన్ననాఁడు
తుంగభద్రాసముత్తుంగ రావముతోడ
కవులగానము శ్రుతి గలయునాఁడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ
శ్రేణిలోఁ దెన్గు వాసించునాఁడు
కృష్ణా తరంగ నిర్ణిద్రగానముతోడ
శిల్పమ్ము తొలిపూజ సేయునాఁడు
అక్షరజ్ఞానమెఱుఁగదో యాంధ్రజాతి?
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుఁబాట పిచ్చుకగూండ్లు కట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు
'వేంగిక్షేత్రము' పురావైభవము తలఁచుకొని విశ్వనాధకవి గుండె జల్లుమన్నది. ఆర్ద్రమానసుఁడైన కవి కార్చిన వేఁడి కన్నీళ్ళు కరళ్ళుకటి యిట్టులు పద్యము లయినవి.
సీ. ఏరాజు పంచెనో యిచట శౌర్యపుఁ బాయ
సమ్ములు నాగుల చవితినాళ్ళ
ఏ యెఱ్ఱసంజలో నెలమి పల్లవరాజ
రమణులు కాళ్ళఁబారాణులిడిరొ,
చిత్రరధ స్వామి శ్రీరథోత్సవములో
తెలుగు పిల్లలు కత్తి త్రిప్పిరెపుడొ,
యే రెండు జాముల యినునివేఁడిమి వచ్చి
కలసి పోయెనొ త్రిలింగ ప్రభువుల