ఈ పుట ఆమోదించబడ్డది

పువ్వులయంగడి మున్నగు నెన్నో ప్రకరణము లిందు గలవు.. కావ్యము గద్యపద్యాత్మకము. కవిలోకజ్ణత కిది యద్దము. ఆకాలమున నిట్టిక్రొత్తయూహ లూహించిన కృతికర్తను నేటిచారిత్రకులు ప్రశంసింప దగియున్నది. ఇందలిపద్యము లన్నియు గొప్పవి. అచ్చటచ్చటివి మచ్చు.

మ. ఎరణాయూరును గత్తివాక యడసూరిరెన్నెళుంబూరు మే
ల్తిరునట్టూరును రాయపేట తిరుపల్లిక్కేళి చేపాకమున్
బరశుంవాక పరంగికొండ మరకృష్ణాంపేటయన్ లోనుగా
బురిచుట్టున్ విలసిల్లునాటుపురమల్ భూతింద దేకాకృతిన్.

గీ. సరకు నింపను దింపను సారెసారె
దరులయొద్దకు దరియొద్ద కరుగుపడవ
లోడలకు మేడలకు మైత్రినొసరగూర్ప
నిటు నటు చరించుచారుల నెనసి వెలయు.

మ. అల మోగ్మేను సరంగి బొంబయియు బర్మాసీమపైగోవ బం
గళ కోరంగియు నాదిగాగలుగు ప్రఖ్యాతంపుకోస్తాల నా
వలరాక ల్నగరీజనంబులకు రేవల్ దెల్పు రంజిల్లు ను
జ్జ్వల'సీకష్ట' నివిష్ట కేతన పటు స్తంభాగ్రచేలచ్చటల్.

సీ. క్షమవిహరించువాక్సతి పుట్టినయిలు మ
          తుకు మల్లి కులమతల్లిక తదస్వ
యోదితు వేంగళార్యాదులు మాల్యశై
          ల నృసింహ కరుణోపలబ్ధ పర చ
తుష్షష్టి విద్యావిదులు భవత్ప్ర పితామ
          హుండు మాధవకవీంద్రోత్తమ డభి
నవభారతాది నానాగ్రంథకర్త నీ
          తాత నృసింహ విద్వద్వరుండు

గీ. శబ్దశాస్త్ర త్రయీ విచక్షణుడు నీదు
జనకు డైనట్టి కనకాద్రిశాస్త్రివర్యు
డఖిల శాస్త్రార్థవేది నీవద్భుత ప్ర
సిద్ధసారస్వతుడవు నృసింహశాస్త్రి!

                         _________________