ఈ పుట ఆమోదించబడ్డది

సత్యనారాయణగారు మహోదాత్తమైన పీఠిక వ్రాసినారు. దానియందు సర్వవిషయములు విమృష్టములు. ' బెబ్బులి ' లోనున్న పద్యములు కొన్ని యేప్రబంధకవులు వ్రాయ నేరని తీరులలో వీరువ్రాసిరి.


సీ. ఆత్మగౌరవ రక్షణార్థమై యుసురు తృ
          ణప్రాయ మంచు బెనంగవలయు
వెల్మ కులద్వేషి విజయరాముని సంహ
          రింప గంకణము ధరింపవలయు
బాశ్చాత్యసేనకు భరతపుత్రుల బలో
          ద్రేక మీతూరి బోధింపవలయు
జచ్చియో వగతుర వ్రచ్చియో దశదిగ్వి
          శద యశశ్చట వెదచల్లవలయు


గీ. మరణ మున్న దొకప్పుడు మానవులకు
సద్యశం బొక్కటే చిరస్థాయి గాన
యుద్ధరంగాని కురుక సన్నద్ధ పడుడు
దళిత పరిసంధులార ! ఓ వెలమలార !


శా. వాలున్ డాలును గేల గీల్కొలిపి దుర్వారాహవ ప్రాభవో
ద్వేలాభీల కరాళ విక్రమ కళావిస్తారులై భారతీ
యాలోక ప్రతిభావిశేషమున రాజ్యస్థాపనోత్సాహులై
లేలెండీ ! యిక వెల్మవీరులు యశోలేశంబు నాసింపుడీ !


సీ. హైదరు జంగు పాదాశ్రయ మొనరించి
          దురము గల్పించిన ద్రోహబుద్ధి
ఉన్నంతలో దృప్తి నొందక వెలమరా
          జ్యం బేల గోరు దురాశయంబు