తాంధ్ర సాహితీ పురస్కృత సరస సారస్వత
చతుర వాగ్ధోరణి..............
ఈ కృతి యానృసింహస్వామికే యంకితము.
ఈ కవిసింహుని యతర కృతులలో "చెన్నపురీవిలాస" మొకటి చెప్పుకొనదగినది. ఇది శ్రీరాజా బొమ్మదేవర నాగన్ననాయడు జమీందారువారి యాజ్ఞచే రచియింపబడిన కృతి. ఈయన కృష్ణా మండలములోని "తోట్లవల్లూరు" సంస్థానాధిపతి. ఆ సంస్థానమున నీ నృసింహకవి పండితుడుగను, బరీక్షాధికారిగను నుండెను. సంస్థాన ప్రభువువలన మన కవి మహాసన్మానముల నందుచుండెను. కొమ్ములు తిరిగిన పండితులు వార్షికములకు వచ్చినపుడు వీరే పరీక్షాధికారులు. తర్కాదిశాస్త్ర పండితులగు శ్రీ ప్రభల సుందరరామశాస్త్ర ప్రభృతులను వీరు శాస్త్రవాదమున నోడించిరని యందురు. శ్రీ జగద్గురు శంకరాచార్యులవారి పీఠ విద్వాంసుల సమక్షమున బైవారికిని మన శాస్త్రిగారికిని దర్కశాస్త్రీయవాద మిరువదియొక్క దినము జరిగినదట. అప్పుడు వీరి విజయము నెఱిగి పీఠాచార్యులీపండితు నేనుగుపై నూరేగించిరట. ద్వైతాద్వైతవిశిష్టాద్వైతములలో వీరి వాదప్రావీణ్యము మగణ్యము. నృసింహోపాసకుడగుటచే నీయనయెదుట వాదముచేసి నెగ్గిన వారు లేరని వచింతురు. వీపి బుద్ధిలో బ్రతిఫలిపని శాస్త్రము లేదు. కళ లేదు. ఇందులకు వారి గ్రంథమలే సాక్షులు. ఈయన ముప్పది యేండ్లు వచ్చువఱకు బితురంతే వాసియై షట్ఛాస్త్రములు లోతులుమాట్ట వ్యాసంగించెను. అప్పుడు వాక్యార్థములకు గ్రంథరచనకు గడగెను. లోకమర్యాదకు సంస్థానపండితుడుగా నుండెగాని ప్రభువుకు లొంగియుండలేదు.
సంస్థాన ప్రభువు నాగయ్యనాయడుగారితో కలిసి నీ కవి చెన్నపురము వెళ్ళినపు డాపట్టనవిలాసములు ప్రబంధరూపముగ వర్ణింపుడని యడుగనీ "చెన్నపురీవిలాసము" రచించిరట. అది 1860 ప్రాంతము. నాటి మదరాసులోని విశేషములన్నియు నిందు గన్నులకు గట్టినట్లు వర్ణింపబడినవి. వీధులు, మేడలు, సముద్రము, రైలు, పోటోగ్రాపు, అచ్చు కూటములు, ఆసుపత్రులు, మ్యూజియము, లైటుహౌసు, హార్బరు