ఈ పుట ఆమోదించబడ్డది

మహామహోపాధ్యాయుడు బంగారు వృత్తములో నిట్లు భుజంగరాయ కవి నుగ్గడించెను.


వాకట్టు గట్టించి పరలెద వట నీవె

యందఱ కిష్ట మృష్టాన్నభుక్తిహర్షముగా

గట్టింతు వట నీవె పుట్టంబులనె యెందఱనొ

ప్రబంధుండన నెనయ ముదము , ఘనుడవుగా

మునుగువేయించుచు నొసగెదవట నీవె

సత్పండితులకు సాలువులను శ్లాఘ్యముగా

జేకట్టు కట్టించి చెలగెద వట నీవె

కవివరులకు బైడి కడియములనె, ఖ్యాతిగదా


ధర్మభూయంత్రములను స్తంభన మొనర్చి వంద్యుడెయౌ

సాప్రభాకరునే యాగితట యెటువలె నారసెదో

యొక్క డిక్కవిమణి నీకు జిక్కె నిపుడు చక్కగాను

సత్కవీశ్వరరాజ భుజంగ రాయ! సర్వగేయ!


విశ్వతోముఖమగు బుద్దిబలమును బ్రస్తరింపజేసి కవులలో గవులై, పండితులలో బండితులై, విమర్శకులలో విమర్శకులై, ప్రభువులలో బ్రభువులై, దాతలలో దాతలై ఖ్యాతినందిన యదృష్ట జీవనులు భుజంగ రావుగారు.


మత్తయినువార్త, క్రైస్తవగూడార్థ దీపిక, మాల్కిమవార్త, యోహానునువార్త ఇవి వీరు పద్యములుగా వ్రాసి తమకై పరమతాభిమానమును జాటుకొనిరి. ఇట్లని ప్రాచీన మతాచార్యుల యధృష్టములను శిరసావహింపనివారు కారు. ఇటీవల వీరు వెలువరించిన యెనిమిది నూర్ల పద్యములతో గూడిన 'తత్త్వ మీ మాంస చూడుడు ఇందు శంకర, రామానుజ, మధ్వాచార్య, చైతన్య బుద్ధ, జైన, మహమ్మదుల మతాశయములు సరిచూపుతో బగి