ఈ పుట ఆమోదించబడ్డది

'ఆంధ్ర విశ్వవిద్యాలయము' సాలునకు నూఱువేలు వీరి వలన బడ్యుచున్నది. దానికి వీరు ప్రధానాధ్యక్షులు. విశ్వవిద్యాలయము మీది యభిమానముచేగాబోలు, ఈపండిత ప్రభువు 'విశాఖపట్టణము'లో దఱచు మకాముచేయుచు 'హావామహాలు' విశాలమైన వరండాలో దర్శింపవచ్చిన విద్వాంసులను, కవులను, అర్థులను దత్తదుచితరీతి నాదరించి గౌరవించుచు నిరంతరము గ్రంథపఠనమునందో, గ్రంథ రచనమునందో నిమగ్నుడై యుండును. వీరు 8-61981 వ.తేదీని జయపుర సామ్రాజ్య సింహాసనమునకు వచ్చిరి. రాజ్యమునకు వచ్చన పూర్వము పరముకూడ వీరి స్వభావము గర్వరహితమైనదే.


ఈయన "సాహిత్యసామ్రాట్టు" గా బేరుమోసి యెందఱో తెలుగు కవుల వలన మధురకృతులు పొందిరి. రసజ్ఞడు, విద్వాంసుడు, మహారాజు నగు నీ విక్రమదేవవర్మకు శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు 'మేఘ దూత' కావ్యము నంకిత మొసగినారు. ఒసగుచు వారు వ్రాసిన పద్యమిది:-


ప్రజలు బెగడొంద యుద్ధ లంపటుడుగాని

కృష్ణరాయడు, తెలుగున మృదుల కపన

మును బొనర్పగ నేర్చిన భోజరాజు

తలప విక్రమదేవ విద్వత్ప్రభుండు.


కొక్కొండ వేంకటరత్నముగారు 'సింహాచలయాత్ర' విక్రమదేవవర్మగారి కంకితము చేసిరి. విఖ్యాత విద్వాంసులగు బులుసు పాముల శాస్త్రిగారు తాము రచించిన 'అలంకారసంగ్రహము'న నీ సాహి ................. .................... .................... ..................... ....(పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)