ఈ పుట ఆమోదించబడ్డది

వరప్రసాదము. అప్పటి నాయితరకృతులు లోకమెన్నడో చదువవచ్చును. నాకవిత్వ మనుపేర నిప్పటి కీ శివభారతము చాలును......'


ఈ పలుకులు విలువ గట్టరానివి. శివభారత మంతయు నొకయెత్తు, ఈ యక్షరములన్నియు నొకయెత్తు. ఇది చిత్తస్ఫూర్తిగ వ్రాసినమాట, వారికృతి పూర్తిగ జదివి చూచి నామనస్సులో నే ననుకొంటిని "శేషశాస్త్రిగారూ! నన్నయ్యమూర్త్యంతరమగు సోమయాజులా మీరు? కవిత్రయభారతమువలె 'జగము లున్నంతవఱ కెల్లజనులు చదివి తనియుటకు' శివాజీ ప్రబంధము రచించి శివభారత మని పేరుపెట్టుకొంటిరా? ఎంత గడుసుదనము! ఔను. తిక్కన రాజకీయపరిజ్ఞానము మీ రొక్కరే తక్కించుకొంటిరి కాబోలు! కానిచో, మీగ్రంధాది విజ్ఞప్తిలో నటులు వ్రాసికొనుట కెన్నిగుండె లుండవలయును!" అని-


శేషశాస్త్రిగారు 'నాంది' లో నన్నయాదిప్రక్త నాద్యతనాంధ్ర కవుల నభినుతించినపిమ్మట బ్రత్యేకముగ సోమయాజి కీ చంపకము కాన్క నిచ్చెను.


హరిహరనాథ శాంత మధురాకృతిలోపలిచూపునన్, బురా

చరిత తప:ఫలం బుభయ సత్కవిమిత్రత వెల్గ, ధ్యాన త

త్పరుడయి భారతాగమము పల్కెడు తిక్కన వాక్కువెంట ద

త్కరమున దాండవించు వరదాయిని లేఖిని, నే భజించెదన్.


తిక్కశర్మ పలుకుబడి యొరవడిగ, ఒక్కొకయెడ నూతనభావములు మెఱవడిగ, "ఉభయమార్గసమన్వధోరణీ గుణధ్యేయముగ," "భారతామ్నాయము దీటుగ" శివభారతము రచించి మాతృపితృ పూజానుమస్రజంబు జేసి కృతకృత్యులైరి. శివభాతము మహాకావ్యము. ఇందలి యెనిమిది యాశ్వాసములందును మొత్తము 2500 పద్యము లించు మించుగ నున్నవి. దీనికి ఉపోదాతము వ్రాసిన శ్రీ రాళ్లపల్లి అనంత