గల మంచిగుణము. ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము వీడక చేతలలో స్వాతంత్ర్యము చూపిన నిరంకుశు డీయన. తెలుగువారిలోని కొన్ని జాతులను గురించియు గొన్ని వర్ణములను గురించియు మన రావుగారు వెలువరించిన నిర్ణయములు కొన్ని సంస్థానములకు గోపకారణము లైనవి. సంస్థానప్రభువులు కొందరు వీరభద్రరావుగారిపై నాగ్రహము చూపుచుండిరి. వారు తలచినచో నేమి చేయలేరు ? వేదము వేంకటరాయ శాస్త్రిగా రిది గుర్తించి ' వీరభద్రరావుగారు ! ప్రమాదము సుమండీ ' యని మందలించిరట. వీరది లెక్కసేయుదురా ? సత్యప్రకటనమే సత్పరిశోధన లక్షణమని నమ్మిన నిర్భీకు డాయన. పంతులుగారు ' అళియరామ రాయలు ' అను గ్రంథములో ' రివరెండుహీరాసు ' గారి వ్రాతలను సయుక్తికముగ ఖండించిరి. ఆంధ్రేతిహాస పరిశోధక మండలి వెలువరిచిన కాకతీయ సంచికపై వీరిఖండనము సప్రమాణమై మెచ్చు నందినది. వీరి ' జీర్ణకర్ణాటసామ్రాజ్యము ' యాంధ్రాభిజ్ఞఉలు పెక్కు 'రౌ' ననిరి. ఇదియే వీరి తొలిరచనము.
పంతులుగారి విమర్శన శక్తి చవిచూడనివా రుండరు. వీరి యాంధ్రుల చరిత్రలోని కొన్నికొన్ని సిద్ధాంతములు నూతన పరిశోధనముల వలన నిలుచునవిగావు. ప్రథమప్రయత్నము లన్నిటిలోను గొన్నిదోషము లుండుట క్రొత్తగాదు. అది యాక్షేపణియమును గాదు. వీరి విమర్శలో మొగమాట మనునది పూజ్యము. సత్యపరిశోధనమునకు దమయాస్తిని దమయారోగ్యమును దుదకు దమప్రానములను గోల్పోయిన మృతజీవులు. జననము మొదలు మరణము వరకు గష్టపరంపరలతో నిండిన జీవితము వీరిది. దానికి హేతువు నిరంతర పరిశోధనపరత్వమే. ఒక సభలో కట్టమంచి రామలింగారెడ్డి ' వీరభద్రరావుగారి విమర్శనశక్తి చాల గొప్పది. దానిని వర్ణింప నా కర్హతలే ' దని యుట్టంకించినారు. ఆంధ్రచరిత్రకారులలో వీరభద్రరావుగారు, లక్ష్మణరావుగారు,