ములు వ్రాసిరి. లక్ష్మీనరసింహకవి జ్ఞానైకచక్షుష్కుండు. వీరికి 40 వత్సరములు యీడు వచ్చువఱకు సంపూర్ణనేత్రావరోధము కలుగలేదు. 1909 నుండి మాఱెను. 'కృపాంభోనిధి' నీకవి యీవిధముగ బ్రార్థించు చున్నాడు:
అన్నా ! నీద గుమూర్తి యెట్టిదియొ జాత్యంధుడు కాలాద్యవ
చ్ఛిన్నంబై జగదేక పూర్ణమగు నీ చిన్మాత్ర దివ్యాకృతిం
గన్నారం గను బుండరీకదళసంకాశ స్ఫురన్నేత్రుడున్
నిన్నుం జూడగలేడు చిత్ర మిది తండ్రీ ! సత్కృపాంభోనిధీ !
అందలి యమృతనిష్యందులగు పద్యములు మఱికొన్ని:
శా. తోలుంగన్నులు చూడలేవుగద విద్యుత్కోటి భాస్వత్ప్రభా
జాలాతీత జగత్ప్రపూర్ణ ఘన తేజో రాశి నీమూర్తి నిన్;
నాలోగన్న యినం గనుంగొను నటన్నన్ జ్ఞాననేత్రంబు లే
నేలే; దేగతి నిన్ను జూడనగు దండ్రీ సత్కృపాంభోనిధీ !
మ. బలిమిన్ రబ్బరు లాగ సాగి మొదటన్ స్వస్థానముంజేరు నా
వల, నట్లే బలిమి స్మనస్సును భవత్పాదద్వయి న్ని ల్ప నా
స్థలమందయ్యది నిల్వ కెప్పటియటుల్ దౌర్గత్యముంజెందు, ని
ష్ఫలమౌ నాజతనం, బి కేమిగతి దేవా ! సత్కృపాంభోనిధీ !
శా. ఆకుంబచ్చల పళ్లెరంబుల బ్రవాళాలి న్ని వాళుల్ తగన్
నీకర్పించి, విహంగనాదమను మేల్గీతంబులంబాడి, తా
మేకాలంబును బూలు కాంకలిడి తండ్రీ ! భక్తి వృక్షాంగనల్
నీ కాత్మీయకృతజ్ఞతం దెలిపెడు న్నేర్మిన్ కృపాంభోనిధీ !
మ. గగనం బద్భుతలీల నీదగు నిరాకారత్వమున్ గాలి నీ
దగు విష్ణుత్వము, నీరు నీకరుణ, దీప్యద్వహ్ని నీతేజు నీ
దగు శాంతిన్ ధర చాటుచున్నయవి, యాహా! పంచభూతంబు లే
పొగడున్నీ గుణరాజి వందులయి శంభూ ! సత్కృపాంభోనిధీ!