ఈ పుట ఆమోదించబడ్డది

భాషాప్రపంచమున జిరస్థాయులై నిలువగలిగినవి. "కాగదా" శబ్దమును గుఱించి వీరు కూర్చిన చిన్న పొత్తము నరసిన వీరికిగల భాషాశాస్త్ర విషయ పరిజ్ఞానము విశదముకాగలదు.


ఈయన పద్యకవిత్వముకూడ జక్కనిశైలిలో వ్రాయగలరు. మంగతాయి నాటకమునుండి పద్యములు కొన్ని యెన్నుకొందము.


గీ.వేశ్య కావిమోవి వెలయిచ్చువా రెల్ల

వంట బట్టి పీల్చు భంగి గానె

యేక పాత్రమువననె యెంగిలి నాకయే

కాఫి త్రాగుచుంద్రు కలసి జనులు

ఆ.వె.వణ్యభామినిచే బడ్డ పుణ్యశాలి

పుడమి గాంభీర్యహీనుడై చెడకయున్నె

జలజలత యంటిసంతస సరసు లొగిని

నమిత గాంభీర్యహీనత నందినట్లు

గీ. ఆట వెలదుల యిండ్లును నమ్మవారి

గుడులు గాలిగోపురములు గోవెలలును

దోటలు పురమందిరములు పూటకూటి

యిండ్లు జూదంబునకు దగు నిక్కలరయ.

వేశ్యలందు కలుగుమోజు! వేడ్క సేయ నౌ డినీజు

పొందువలన బుట్టు పుండు! మందు వేయమానకుండు

దేహమెల్ల నౌను పుల్ల! గేహమెల్ల నౌను గుల్ల

కీర్తి యంత మాసిపోవు! నార్తి హెచ్చ వచ్చు జాపు

ఏమిలాభమనుచు నీవు! భూమి గణిక పొందుతావు

వలదు వలదు వలదుమా! సాని గూడ జనమ నూ


గీతములు, గడ్డెపరక, కోకిలగీతములు, గోమహిషసంవాదము,---------సందర్శనము, మొదలగు ఖండకృతులు గనిన వీరి పద్య-------------


(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)