ఈ పుట ఆమోదించబడ్డది

పరిణయము (కుందుర్తి వేంకటాచలకవి) 4. చంద్రాంగదచరిత్రము (పైడిమఱ్ఱి వేంకటపతి) 6. యాదవరాఘవపాండవీయము (నెల్లూరి వీర రాఘవకవి) వైజయంతీవిలాసము (సారంగు తమ్మయ) ఇవి ప్రాచీనములగు ప్రబంధములు. ఆధునికకృతులుకూడ నిందు బ్రచురితములు. ఓగిరాల రంగనాథకవిగారి 'ద్విరేఫదర్పణము' మండపాక పార్వతీశ్వరకవిగారి శ్రీకృష్ణభ్యుదయము మున్నగునవి.

సహజముగ నీయన చిన్ననత్తికలవాడని, కాని పద్యములు మధురకంఠమున జదువునపు డానందముగ నుండెడిదని చెప్పుకొనుట.

రామకృష్ణయ్యగా రొనరించిన భాషాసేవ చిరస్మరణీయము. ఈయన గతకాలములో స్మృతిదప్పి పడియున్నప్పుడు వేంకటగిరి ప్రభువు వీరికి కొంతధనము పంపి వారిచెవికడ 'వేంకటగిరిరాజు పంపె' నని గట్టిగా కేకవేయించి యిచ్చుటకాజ్ఞ పెట్టెనట. ఆమహారాజున కీయనపై నంతయభిమానము.


                               ________