ఈ పుట ఆమోదించబడ్డది

జతనము మీఱంగ నము

ద్రితసద్గ్రంథముల సేకరించి కడు బరి

ష్కృతములు గావించి యథా

మతి బత్త్రిక గూర్చెదము క్రమంబుగ వానిన్.


తోరపు నూలుదారములతో బదిలంబుగ గట్టి పెట్టియం

బేరుప నందు జీర్ణదశ జెంది మొగిం గ్రిమికీటకచ్ఛటా

పూరితమైవృథాసెడు సముద్రితపుస్తకపంక్తి నెంత యుం

గూరిమి మీఱ నచ్చునను గూర్చుట సెల్లదె పత్త్రికాకృతిన్.

ఆముద్రిత గ్రంథప్రకటనము, వ్యాకరణచ్ఛందోవిషయవిమర్శనము నీపత్రిక ప్రధానోద్దేశములు, మండపాక పార్వతీశ్వరశాస్త్రి, వేదము వేంకటరాయశాస్త్రి ప్రభృతులపాండిత్యశక్తి నీపత్రికయే చాటినది. రామకృష్ణయ్య గారి విమర్శకతి 'మయూఖము' లలో వెల్లివిరిసినది. శ్యమంతక, శబ్దవిచారము, పటుశబ్దప్రయోగము, పరిఖా పరిఘ శబ్దద్వయసాధుత్వము బిలేశ్వరీయకృతి విమర్శనము ఇత్యాదులు రామకృష్ణయ్యగారికి విమర్శ కాగ్రేసర బిరుదము నీయగల వ్యాసములు. వీరి విమర్శనము కేవలశాబ్దికమే కాదు. నాటకాదులలో గ్రామ్యభాషాప్రయోగము చేయవచ్చునా? ఇత్యాదివిషయములుకూడ వీరి నిశితవిమర్శకు విషయములైనవి. వేదము వేంకటరాయశాస్త్రిగారి 'నాగానందము' లోని పాత్రోచితభాషను వీరు చక్కగ సప్రమాణముగ సమర్థించిరి. నాడు వీరివ్రాత పండితులకు శాసనము.

అ.గ్ర. చింతామణిలో వెలువరించిన గ్రంథము లివి: 1 ప్రబంధరాజ వేంకటేశ్వరవిజయవిలాసము. (గణపవరపు వేంకటకవి) 2.హరిశ్చంద్రవలోపాఖ్యానము. (రామరాజభూషణుడు) 3. మిత్త విందా