ఈ పుట ఆమోదించబడ్డది

యును పురాణన్యాయ మీమాంసాదులగు పెక్కు విద్యాస్థానములచే నుపకరింపబడినదియు దీపమువోలె సర్వార్థములం బ్రకాశింప జేయునదియు సర్వజ్ఞకల్పము నగు ఋగ్వేదాదిశాస్త్రమునకు బ్రహ్మము యోని = కారణము. సర్వజ్ఞఉనిగుణమగు సర్వార్థములం బ్రకాశింపజేయు శక్తితోగూడిన ఋగ్వేదాది శాస్త్రమునకు సర్వజ్ఞఉనికంటె వేరొక దానినుండి యుత్పత్తి సంభవింపదు. పాణిని మొదలగు వారవలన దెలియందగినవానిలో నొకభాగమగు వ్యాకరణాదికమువలెనే యేయేవి ... రాథమగుశాస్త్ర మేయే పురుషుని వలన బుట్టుచునందో యాతడా శాస్త్రము కంటె నధికతర విజ్ఞానము కలవాడని లోకము నం బ్రసిద్ధము..."

శాస్త్రిగా రీరీతిగ బూసగ్రుచ్చినట్లు సూత్రభాష్యభావము కొరవడ కుండ దెనిగించి యాంధ్రభాషకు మహోపకృతి గావించిన మహాశయులు. మల్లయ్యశాస్త్రిగారు "ఉపనిషత్కథలు" వ్యాసిరి. "శుక్రనీతి సారము" వచనమున రచించిరి. పింగళి సూరనార్యుని ప్రభావతీ ప్రద్యుమ్నమునకు వ్యాఖ్య వ్రాసిరి. వీరి గ్రంథములన్నియు పీఠికాపుర ప్రభువులే ప్రకటించిరి. అల్లమరాజు సుబ్రహ్మణ్య కవిగారి భద్రాపరిణయమునకు వ్యాఖ్యా విపులపీఠికలు రచించిరి. అనేక పాఠాంతరములతో ననుగుణమగు వ్యాఖ్యతో నాంధ్రభారతములోని కొన్ని పద్యములు వీరు పరిష్కరించిరి. ఈ పీఠిఅవల్ల వీరి యాంధ్రకవిత్వ పరిశ్రమ తెల్లమగును. మల్లయ్య శాస్త్రిగారు పద్యకవిత్వమున గృషిచేసిన కవులు కారు. అయినను నడుమనడుమ బద్యము లల్లునలవా టున్నది. అల్లినపద్య మందముగనే యుండును.

శ్రీరఘువంశ వారినిధిశీతమయూఖుడు జానకీమన
స్సారనచంచరీకము నిశాచరమత్తకరీంద్ర సింహమున్
ధీరజనాగ్రగణ్యుడు సుధీజనసన్నుతకీర్తిశాలియౌ
నారఘురామమూర్తి మదినాదర మొప్పగ గాచులోకముల్.
                          ' ఆంధ్రసూత్రభాష్యారంభము '