ఈ పుట ఆమోదించబడ్డది

దీర్థంబు దెచ్చుహస్తికి బెద్ద తానెయై

లంబోదరుడు బృంహితం బొనర్చె

విహగంబులకు నెల్ల బెద్ద తానై కుమా

రునికేకి పెలుచ నిస్వన మొనర్చె

దానె లింగార్చకులకు బ్రాధమికు డనుచు

బ్రాతర నిలుండు కేతనాగ్రముననున్న

ఘంట మ్రోయించె వందిమాగధులు తామె

యగుచు భక్తులు పేర్కొని రపుడుమమ్ము.

మహేంద్రవిజయము.(......)

శాస్త్రిపాదుల దేవభాషాకవితాధోరణి కొక శ్లోకము మూదలింతును.

జ్ణాతార శ్శ్రోతార స్స్తోతార: కాంక్షి తార్థదాతార:

నేతార స్సంతి యదిఖ్యాతా రచయంతి సత్కృతీ కనయ:

అన్నదమ్ము లిర్వురును సంస్కృతభాషా కవితలో జేయితిరిగిన వారు. తమ్మనశాస్త్రిగారి ధారాశుద్ధి మాడుడు.

ఫణీశదర తారకా శశిమణీ ఘృణీధోరణీ

తృణీకరణనై పుణీ విలసితాపన న్యాంగకమ్

గణాధిపసమర్చితం గణసుధీగణ గ్రామణీ

పణాయితగుణాన్వితం మనసి కుక్కుటేశం భజే,

తమ్మనశాస్త్రిగారి తెలుగుకూర్పులలో నయనోల్లాసము, యతిరాజ విజయము పేర్కొనదగినవి. నయనోల్లాసము ప్రభుపట్టాభిషేకోత్సవ సమయమున వెలువడినది. అప్పుడు "నయనోల్లాసము" సార్థకత నొందినది.ఇందలిపద్యములు ధారాళముగా నడచినవి. కానివ్యర్థపదములు బహుళముగ దొరలినవి. వీరి "యతిరాజవిజయము" చక్కనిశైలిలో నున్నది.ఇది మూడాశ్వాసములు వ్రాసి తమ్మనశాస్త్రిగారు గతించిరి. వారి తరువాత బీఠికాపుర సంస్థానకవులు వేంకటరామకృష్ణులు తక్కిన