ఈ పుట ఆమోదించబడ్డది

101

వ్రాసినట్లున్నను జాల భాగ మిదివఱలో నాచే బ్రకతింప బడిన కవి జీవితముల యర్థ సంగ్రహమే కాని వేఱు కాదు. ఏవియైన నొకటి రెండు కథలు నవీనముగా కాంపించుటకు జేర్పబడినను నవి యనవసరమైన చారిత్రములు గానైనను లేక ప్రత్యేకము కవిత్వ శైలిం జూపుటకు వ్రాయ బడిన పద్యములు నుదాహరణములుగా నైన నుండును............

ఇది యటుండె, రామ మూర్తి పంతులు గారిది సువర్ణ విగ్రహము. విగ్రహమునకు దగ్గగుణసంపత్తి. ఈయన 'మెట్రిక్యులేషన్ ' నేటి ఎం.ఏ లకు సహపాఠి. వీరు కాకినాడ సబ్ కోర్టులో నుద్యోగించుచు రాజీనామానిచ్చి 1830 లో విజయనగర సంస్థానాధీశ్వరులు ఆనంద గజపతి సన్నిధిని నిలయ విద్వాంసుడుగా నుండెను. ఆ ప్రభువున కీకవి యెడల జెప్పలేని యాదరము. ఆనంద గజపతి నిర్యాణము 1897 లో. ఆ తరువాత రామమూర్తి గారిని సంస్థానము పోషించినది. వీరి కవి జీవితములు ఆనంద గజపతి పేరుగా వెలసి యున్నవి.


ఈయన చరిత్ర పరిశీలకుడే గాక కవి కూడను. 'మర్చంటు ఆఫ్ వినీస్ ' నాటకమును బరివర్తించిరి. ఓగిరాల జగన్నాధ కవిగారి యచ్చ తెనుగు నిఘంటువగు ఆంధ్ర పద పారిజాతము ను కొన్ని పదములందు జేర్చి కూర్చి వీరచ్చుకొట్టించిరి. తిమ్మరుసు, బెండపూడి అన్న మంత్రి, ఆప్పయ దీక్షితులు ఈ మూవురు మహామహుల చరిత్రములు సంపాదించిరి. తెలుగు వారి కందిచ్చిరి. మొత్తము, వీరికి జరిత్ర సంధానముపై మక్కువ యెక్కువ. వీరు కాకినాడ నుండి వెలువరించిన ' రాజయోగీ' పత్రిక నాడు పేరు గాంచినది. విజయనగరము ప్రాంతములో వీరికి కాకినాడ పంతు లని పేరు. శ్రీరామమూర్తి గారి 'కవిజీవితములు ' చరిత్రలో నొక కనక ఘట్టము.