ఈ పుట ఆమోదించబడ్డది

వావిలాల వాసుదేవశాస్త్రి

1851 - 1897

తెలగాణ్య శాఖీయ బ్రాహ్మణులు. ఆపస్తంబసూత్రులు. హరితస గోత్రులు. కాపురము: రాజమహేంద్రవరము. జననము: కారుమూరు (తెనాలి తాలూకా) తండ్రి అప్పయ్య. జనన వత్సరము 1851. నిర్యాణము 1897. రచనలు: 1. ఆరోగ్యసర్వస్వము 2. గరుడాచలము 3. నందక రాజ్యము 4. మృచ్ఛకటికము 5. ఉత్తారరామ చరిత్రము 6. మాతృ స్వరూప స్మృతి 7. ఆంధ్ర రఘువంశము 8. జూలియసు సీజరు 9. ముకుక్షు తారకము మున్నగునవి.

రాజమహేంద్రవరమున బ్రకృత కవిత్రయ మనబడిన వారులో వాసుదేవిశాస్త్రిగారొకరు. తక్కుగల యిర్వురలో వడ్డాది సుబ్బారాయుడుగారొకరు. వేఱొకరు వీరేశలింగము పంతులుగారు. కవితా విషయమున గాంచినచో నీమూవురుకును జాలభేధమున్నది. కొక్కొండ వేంకటరత్న శర్మ, ఆకొండి వ్యాసమూర్తి, వాసుదేవశాస్త్రిగారలు కవులలో నొక శ్రేణికి సంబంధించినవారు. ఈ మువ్వుర రచనలలోను నొక ప్రత్యేక విలక్షణత యుండును. వీరిలో నొకరు బహుగ్రంధ కర్తలగుమహా మహో పాధ్యాయులు. ఒకరు భారతాంధ్రీకర్తలగు నాంధ్రవ్యాసులు. ఒకరు దృశ్య శ్రవ్య కావ్య రచయితలు గా విఖ్యాతులు. ఈమువ్వర రచనలలో గూడ నించించుక భేద మున్నను, మొత్తము మీద నొకరకపు కవిశ్రేణికి జెందినవారుగా దోచెదరు.

వాసుదేవశాస్త్రిగారు విద్వద్వంశీయులు.ఈయన ప్రసితామహుడు వెంకటశివావధాని వాసిరెడ్డివారి సంస్థానమున బండితుడు. మనశాస్త్రిగారు బందరునోబిలు కళాశాల పండితులైన కోరాడ రామచంద్రశాస్త్రిగారికడ సంస్కృత విధ్యాభ్యాసము గావించెను. అదిగాక,