ఈ పుట ఆమోదించబడ్డది

త్రిపురాన తమ్మయదొర

1849 - 1890

తెలగావంశీయుడు. తల్లి: చిట్టమాంబ (చిట్టెమ్మ). తండ్రి: వేంకటస్వామిదొర. జన్మస్థానము, నివాసము: విశాఖమండలములో శ్రీకాకుళము తాలూకా సిద్ధాంత గ్రామము. జనను: 1849 సం. సౌమ్య సంవత్సర శ్రావణ శుద్ధ చరుర్దశి గురువారము. నిర్యాణము: 1890 సం. వికృతి సంవత్సర పుష్య శుద్ధ పూర్ణిమ. ముద్రిత శతకములు: 1. నీతిశతకము. 2. పాండురంగాష్టోత్తరశతము. 3. కామినీ నిర్మోహజననతారావళి. 4. విటీవిట నటనార్థమాల. 5. ముఖలింగేశ్వరశతకము. 6. నిద్రా విజయము. 7. శ్రీ దేవీ భాగవత మహాపురాణము (1883 విరచితము - అచ్చుపడలేదు.)

త్రిపురాన తమ్మయ్య దొరగారు మంచికవులుగా బేరుగాంచి "దేవీ భాగవతము" నాంధ్రీకరించిన వారని తెలుగువారికి వేఱే తెలుపనవసరము లేదు. దేవీభాగవతము నిప్పటికి నలువురు తెలిగించరనియు, నానాల్గిటిలోను మూడు ముద్రితములైన వనియు ననుకొని, తమ్మన కవిగారిది మాత్ర మచ్చుపడవలయునని మలము కోరుకొనుచుందుము. మన కోరిక సమకూరుగాక!

తమ్మయ్యకవిగారు తెలగ దొరలు. దంతహుందామాలుకుదారులు. సిరికి దగినయీవి.ఈవికి దగ్గపాత్రవివేకము.కవులను సంభావించిరి. పండితులను గారవించిరి. పేదసాదుల నాదరించిరి. ఉర్లాము జమీందారులు శ్రీ కందుకూరు బసవరాజుగారు ప్రతిశ్రావణికి వేద శాస్త్రపండితుల నాహ్వానించి, పరీక్ష చేయించి వర్షాశనము లొసంగుచుండువారు. అక్కడకు వచ్చిన పండితులెల్ల నిక్కడ తమ్మయ్యదొరగారినిగూడ దరిసించి సత్కారములంది పోవుచుండువారు. వీరినాటి కవులుగాదు, పండితులుగాదు, వీరి గౌరవము నొందనివారు లేరని చెప్పుకొందురు. శ్రీ ముక్కవిల్లిసాంబయ