ఈ పుట ఆమోదించబడ్డది

యణమును గొంతకాలముక్రిందటివఱకును వీధిబడులలో బాలురకు పాఠమునుగా జెప్పుచుండిరి. ఇది పురుషులుచెప్పినగ్రంథములలో ననేకములకంటె మనోజ్ఞమై ప్రౌడమై యున్నది. మొల్ల రామాయణము నందలి కొన్నిపద్యముల నిం దుదాహరించుచున్నాను-

ఉ. రాజులు కాంతియందు, రతిరాజులు రూపమునందు వాహినీ

రాజులు దానమందు, మృగరాజులు విక్రమ కేళియందు, గో

రాజులు భోగమందు, దినరాజులు సంతతతేజమందు, రా

రాజులు మానమందు, నగరంబున రాజకుమారు లందఱున్. [బాలకాండ]


చ. సుడిగొని రాముపాదములు సోకినధూళి వహించి రాయి యే

ర్పడ నొక కాంత యయ్యెనట పన్నుగ నీతనిపాదరేణు వి

య్యెడ వడినోడసోక నిది యెట్లగునోయని సంశయాత్ముడై

కడిగె గుహుండు రాముపదకంజయుగంబు భయంబు పెంపునన్. [అయోధా]


చ. చించెదదైత్యసంఘముల జిందఱ వందఱ చేసి బ్రహ్మ బా

ధించెద లోకపాలకుల ద్రెళ్ళగ నేసెద భూతలంబు గ్ర

క్కించెద శైలజాలముల గీ టడగించెద భూమినందనన్

గాంచెద దల్లడిల్లకుము కంజహితాన్వయవార్థిచంద్రమా. [అరణ్యకాం]


ఉ. సాలముపొంత నిల్చి రఘుసత్తము డ మ్మరివోసి శబ్దవి

న్మూలముగాగ వి ల్దివిచి ముష్టియు దృష్టియుగూర్చి గోత్ర భృ

త్కూలము వజ్రపాతహతి గూలువిధంబున గూలనేసె న

వ్వాలి బ్రతాపశాలి మృదువందనశీలి సురాలి మెచ్చగన్. [కిష్కింధాకాం]