ఈ పుట ఆమోదించబడ్డది

"స్తుతగుణోద్దాము నాచన సోము భీము

నన్యమంజులవాగ్ధుర్యు నన్నపార్యు

రసికు డైనట్టి శ్రీనాథు రంగనాథు"


అని తనరామాయణమందలి కవిస్తుతిలో దిక్కనసోమయాజి కించుమించుగా నిన్నూఱుసంవత్సరముల తరువాత నున్న శ్రీనాథుని స్తుతించుట సంభవింపనేరదు. కాబట్టి మొల్ల శ్రీనాథునికాలమునకు దరువాత నున్నదనుటకు సందేహము లేదు. ఈమె కృష్ణదేవరాయల కాలములోని యల్లసాని పెద్దనాదుల నెవ్వరిని స్తుతియించి యుండక పోవుటచేత మొల్ల యాకాలమున కెంతో తరువాతిది కాదనియు స్పష్టపడుచున్నది. ఈమె కృష్ణదేవరాయలకాలములోనే యున్నట్టు కథలనేకములున్నవి. మొల్ల యాకాలమునందలి కాదని సంశయించుటకు హేతువులేవియు గానరానందునను, ఆకాలపుకవులను స్తుతింపనందునను, ఆమె కృష్ణదేవరాయలకాలమందే యున్నదని నిశ్చయింపవలసి యున్నది. ఇప్పుడున్న తెలుగుగ్రంథములను బట్టిచూడగా, ఆంధ్ర కావ్యములను జేసినస్త్రీలలోనెల్ల నీమెయే ప్రాచీనురాలుగా గానబడు చున్నది. ఈమె తన రామాయణములో,

"... ... ... ...గోప

వరపుశ్రీకంఠమల్లేశువరముచేత నెఱి గవిత్వంబు చెప్పంగ నేర్చినాను"

అని చెప్పుకొనుటచేత నీమె నివాసస్థలము నెల్లూరిమండలము లోని గోపవర మని తెలియవచ్చు చున్నది. ఈమె కవిత్వమునుజూచి తెనాలిరామకృష్ణు డింటిపేరును గూర్చి యడిగి యాక్షేపించిన ట్లొక కథ కలదుగాని యది యిం దుదాహరింపదగినదికాదు. అక్కడక్కడ గొన్నివ్యాకరణదోషము లున్నను మొత్తముమీద నీమెకవిత్వము మిక్కిలి మృదువయి మధుర మయి రసవంతముగా నున్నది. ఈరామా