ఈ పుట ఆమోదించబడ్డది

చ్చల గాంక్షించిరి నిర్నిమేషజలజాస్య ల్మానుషత్వంబు ల

య్యళిభీతి న్ముకుళీకృతాక్షి యగుసత్యాకాంత నీక్షించుచున్. [అ.4]


ఉ. తానటె పారిజాతవసుధారుహముం గొనిపోవువాడు క

న్గానడు యాదవుం డనుచు గన్నులువేయుసు జేవురింప వై

శ్వానర ధర్మ దైత్యవర వారిధి పానిల యక్షనాయ కే

శానులదిక్కు చూచి కులిశంబు కరంబున బూన్చి పట్టినన్. [ఆ.4]


ఉ. సొమ్మన నెద్ది యే ననగ సొమ్మున కెవ్వండ గర్త నీవు నీ

సొ మ్మఖిలప్రపంచమును శూరకులంబు నలంకరించు నీ

వమ్మహి నుండు నంతకు ననన్యదురాపము పారిజాతభూ

జమ్మును నుండు నన్న వికసన్ముఖుడై హరి వీడుకొల్పుచున్. [ఆ.5]

                       _____________

4. ధూర్జటి కవి

ఇతడు పాకనాటి యారువేల నియోగిబ్రాహ్మణుడు; భరద్వాజగోత్రుడు; ఆపస్తంబసూత్రుడు; కాళహస్తిపుర నిలయుడు; శివభక్తుడు. ఈతడు కృష్ణదేవరాయలకాలములో నున్నందున దాదాపుగా 1520 - 30 వ సంవత్సర ప్రాంతములం దున్నవాడని చెప్పవచ్చును. ఇతడు కాళహస్తిమహాత్మ్యమను నాలుగాశ్వాసములుగల పుస్తకమును, కాళహస్తీశ్వర శతకమును రచించి కాళహస్తీశ్వరున కంకితముచేసెను. ఈయన కవనము సలక్షణ మయి మిక్కిలి మధురముగా నుండును. ఈతని కవిత్వ మాధుర్యమున కాశ్చర్యపడి కృష్ణదేవరాయ లొకనాడు సభలో గూరుచుండి తన యాస్థానకవులకు