ఈ పుట ఆమోదించబడ్డది

నొడలు తెలియక భార్య తనశిరస్సున వామపాదముతో నలంకరింపగా గోపించి రాజు భార్యతో సహశయ్యాసంభాషణములు మానివేసెననియు, కవి యీసంగతి తెలిసికొని యాదంపతులను మరల గలుపుటకై యీగ్రంథమును జేసి వినిపింపగా రాజు బుద్ధి తెచ్చుకొని కృష్ణునంతటివానికే యట్టి యవస్థ తటస్థించినప్పుడు తన కేమిలెక్క యని మరల భార్యతో గూడె ననియు చెప్పుచున్నారు.


ఈకవియొక్క దాతృత్వమునుగూర్చి యొక కథగలదు. ఇతడు పారిజాతాపహరణమును రాజున కంకితము చేసినప్పుడు రాజు చతురంత యానమహాగ్రహారములును మణికుండలములును బహుమానము చేసెను. ఆయమూల్యమణికుండలములను ధరించి తిమ్మన వాకిట గూరుచుండి యుండగా నొకబట్టు వచ్చి యాతని కవననైపుణి నిట్లు స్తుతించెనట!

క. మాకొలది జానపదులకె | నీకవితాఠీవి ? యబ్బునే కూపనట

ద్భేకములకు గగనధునీ| శీకరములచెమ్మ ? నంది సింగయతిమ్మా! స్తుతింపగానే యతడు తనయొద్ద నప్పుడు మఱేదియు నమూల్య వస్తువు లేకపోవుటచేత వెంటనే తనచెవి నున్నయమూల్యరత్నకుండల మొకటి యాబట్టుకవి కిచ్చెనట! మఱునాడు తిమ్మకవి యొంటిచెవి కుండలముతోనే రాజాస్థానమునకు బోయి యుండగా నచ్చటి కాబట్టు కవియు వచ్చెనట! అప్పుడు ప్రస్తావవశమున రాజాకుండలదానవృత్తాంతమును బట్టు చెప్పినపద్యమును విని,

క. మాకొలది జానపదులకె | నీకవితాఠీవి ? యబ్బునే కూపనట

ద్భేకములకు నాకధునీ | శీకరములచెమ్మ ? నంది సింగయతిమ్మా!


అని "గగన" యనుటకు మాఱుగా "నాక" యని యుండినచో మరింతసరసముగా నుండునని సెల విచ్చెనట! అప్పు డాపద్దెమునకు వన్నెధెచ్చితిరని చెప్పి తన చెవికుండలమును బట్టుకవియు, తనచెవికుండల