ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. ఇంకిటు నిన్ను నమ్మ నను నేమిటికిం గెరలించె దెంతయుం

బొంకముగాని యీవలనిబొంకులు మాచవిగావు రుక్మిణీ

పంకజపత్రనేత్రకును బ్రాణపదంబులుగాన వల్లవీ

కింకర చాలుజాలు నడకింపకు నింపకు లేనికూరముల్.


ఉ. గట్టివచేతలుం బసలు గల్లదనంబులు నీవు పుట్టగా

బుట్టిన వెందులేనిపలుబోకలమాయలు నీకు వెన్నతో

బెట్టినవౌ టెఱింగియును బేలతనంబున నిన్ను నమ్మి నా

గుట్టును దేజము న్మిగుల గోల్పడిపోయితి నేమిచేయుదున్.


చ. మునిపతివచ్చి పూ వొసగి మోదముతోడ భవత్ప్రియాంగనన్

వినుతి యొనర్పగా వినినవీనుల మాచవిగాని మాటలున్

వినవలసెంగదా యిపుడు నీ విటవచ్చుట పారిజాతావా

సన బ్రకటించి నాకు నెకసక్కెము చేయనకాదె చెప్పుమా.


క. మానంబె తొడవు సతులకు

మానమె ప్రాణాధికంబు మాన మఖిలస

మ్మానములకు మూలం బగు

మానరహిత మైనబ్రడుకు మానిని కేలా?


ఈపద్యములను విన్నపిమ్మట లోకమున బార్యాభర్తలలో నిట్టి వినోదము జరుగుట స్వాభావికము కాదని యెంచి రాజిది స్వభావవిరుద్ధమని పలికెనట! కవి యప్పు డేమియు బ్రత్యుత్తర మియ్యక యూరకుండెనట! అటుపిమ్మట గొన్నిదినములకే రాజు ప్రణయకలహము సంభవించినప్పుడు భార్యవలన దనకు నిట్టిగౌరవమే సంప్రాప్తముకాగా కామావేశపరవశు డయి యానందించి వెంటనే సభకు వచ్చి పుస్తకములో నెల్ల నీభాగమే మిగుల స్వభావసిద్ధముగా నున్నదని శ్లాఘించెనట! ఈకథనే కొంద ఱింకొకవిధముగా మార్చి పొలయలుకలో