ఈ పుట ఆమోదించబడ్డది

ఈకవి కోకటాగ్రహారమునకు శఠగోపపురమని పేరు పెట్టుటయేకాక తన మనుచరిత్రములోను హరికథాసారములోనుగూడ శఠగోపయతిని దనగురువునుగా స్తుతించి యున్నాడు-


క. కొలుతు న్మద్గురు విద్యా

నిలయం గరుణాకటాక్ష నిబిడజ్యోత్స్నా

దళితాశ్రితజనదురిత

చ్ఛలగాఢధ్వాంతసమితి శఠగోపయతిన్. [మనుచరిత్ర]


క. శఠగోపయతికి శఠతరు

కుఠారకోపమమతికిని గురుమతహృ త్క

ర్మఠనిరతికి జతురాగమ

పఠనాయతనియతికి నజపాసంభృతికిన్. [హరికథాసారము]


లక్షణగ్రంథములయం దక్కడక్కడ* నుదాహరింపబడిన పద్యములు లభించుటయేకాని హరికథాసారము పూర్ణముగా దొరికినదికాదు. హరికథాసారములోని యీరెండు పద్యములును రంగరాట్చందస్సునం దుదాహరింపబడి యున్నవి-


క. అంబరముపగుల నార్చి ప్ర

లంబాసురు డాగ్రహము వెలయ గదిరినవే

ళం బలరాముడు చేముస

లంబున వానితల ద్రుంచె లావు మెఱయగన్. [హరికథాసారము. ఆ 4]


క. తెంపరియై మది యింత చ

లింపక యనిలోనదెగియె నెవ్వ డతడు నై

లింప సభ నుండు ననుడు బ

దంపడి యాచార్యుతోడ దా ని ట్లనియెన్. [హరికథాసారము]