ఈ పుట ఆమోదించబడ్డది

పద్యమును వ్రాసిపంపగా నతడు సిగ్గుపడి మరలిపోయినట్టును జెప్పుచున్నారు:-


సీ.రాయరావుతుగండరాచయేనుగువచ్చి

యారట్లకోట గోరాడునాడు

సంపెటనరపాలసార్వభౌముడు వచ్చి

సింహాద్రి జయశిల జేర్చునాడు

సెలగోలుసింహంబు చేరి ధిక్కృతి గంచు

తల్పుల గరుల డీకొల్పునాడు

ఘనతరనిర్భరగండపెండెర మిచ్చి

కూతు రాయలకును గూర్చునాడు

నొడ లెఱుంగవొ చచ్చితో యుర్వి లేవొ

చేరజాలక తల చెడి జీర్ణమైతొ

కన్నడం బెట్లుచొచ్చెదు గజపతీంద్ర

తెఱచినిలుకుక్క చొచ్చిన తెఱగుతోప.


ఈ కవి రూజునొద్ద మిక్కిలి గౌరవముపొందినవా డయి, రాజు చెప్పుమన్నప్పుడు గాక తనయిష్టమువచ్చినప్పుడు మాత్రమే కవిత్వము చెప్పు స్వాతంత్ర్యము గలవాడనియు, రాజొకనాడు కృతి చెప్పుమనివేడగా నతడు చెప్పక యీ క్రిందిపద్యమున జెప్పననియు వాడుక గలదు:-


చ. నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చియిచ్చుక

ప్పురవిడె మాత్మ కిం పయినభోజన ముయ్యెలమంచ మొప్పత

ప్పరయురసజ్ఞ లూహ తెలియంగలలేఖకపాఠకోత్తముల్

దొరకినగాక యూరక కృతు ల్రచియింపుమటన్న శక్యమే?


ఈ కవియే కవిత్వ ముండవలసిన రీతినిగూర్చి యీక్రింది పద్యమును గూర్చెనని చెప్పుదురు:-