ఈ పుట ఆమోదించబడ్డది

న్బెనగక ప్రాణరక్షణ ముపేక్షయొనర్చుట పాప మిందు కై

కనలకు నాకు మేనియెడకాంక్షయు లేదిదివోపుటేయురున్:-అ. 6

ఉ. బాసలు బండికండ్లు మఱి ప్రాణభయంబున లక్షచేసినం

గ్రాసము కృఛ్రలబ్ధ ముడుగ న్వశమే యిది నీకచెల్లె నో

భూసురవంశ్య పుణ్యజన పుణ్యజనాంకము తావకీసమే

పో సమకూరెడిం గులముపొత్తున దైత్యుల కెల్ల నంకతన్:-ఆ. 6

ఆముక్తమాల్యదనుబట్టియే కృష్ణదేవరాయలు విష్ణు భక్తుడనియు వైష్ణవ శిష్యుడనియు వేఱుగ జెప్ప నక్కఱలేకయే తెలిసికొనవచ్చును. అతడు విష్ణుభక్తుడైనను వైష్ణవశిష్యాగ్రేసరు డైనను, ఇతరదేవతల యందుగాని యితరమతములవారియందు గాని వై షమ్యము లేని వాడయి యుండెను. ఈ రాయలవారు విష్ణు దేవాలయములకు మాత్రమేకాక శివాలయములు మొదలైన వానికిగూడ భూదానములు చేసియున్నాడు. వైష్ణవమతాభిమానులను మాత్రమేకాక యితరమతావలంబులైన విద్వాంసులనుగూడ నాదరించియున్నాడు. ఆతని యాస్థానములో నల్లసానిపెద్దన మొదలైన వైష్ణవమత పక్షపాతులైన కవులుమాత్రమేకాక, స్మార్తుడై శివభక్తుడైన నందితిమ్మనార్యుడును, కేవల శైవులైన ధూర్జటియు, మాదనగారి మల్లన్నయు మొదలైన కవులునుకూడ సమ్మానమును బొందియున్నారు. అష్టదిగ్గజములని పేరొందిన యెనమండ్రు తెలుగుకవు లీరాజుయొక్క యాస్థానమునందుండి ప్రసిద్ధినొందిరని చెప్పుదురు. అల్లసానిపెద్దన, నందితిమ్మన్న, అయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి, మాదయ్యగారిమల్లన్న, పింగళిసూరన్న, రామరాజుభూషణుడు, తెనాలిరామకృష్ణుడు, అనెడి యెనమండ్రును అష్టదిగ్గజము లని వాడుక గలదు. కాని యిందు జెప్పబడినవారిలో గడపటి ముగ్గురును గృష్ణదేవరాయని కాలమునందున్నారో లేరోయని సందేహింపవలసి