ఈ పుట ఆమోదించబడ్డది

తాను బూర్వము దిగ్విజయయాత్రకు వెడలి బెజవాడయందు గొన్నిదినములుండి కృష్ణామండలములోని శ్రీకాకుళమునందలి యాంథ్ర విష్ణుదేవుని సేవింపబోయిన హరివాసరమునాటి యాదేవుడు స్వప్నములోతోచి వేంకటేశ్వరుని కంకితముగా దెనుగుగ్రంధమును జేయుమనగా విష్ణుచిత్తీయమును రచియించినట్లు కవి తనగ్రంథమునం దీక్రింది వచనములతో జెప్పియున్నాడు.

"...కళింగ దేశవిజిగీషామనీషం దండెత్తిపోయి విజయవాటిం గొన్నివాసరంబులుండి శ్రీకాకుళ నికేతునుండగు నాంధ్రమధుమధను సేవింపంబోయి హరివాసరోపవాసం బచ్చట గావింప నప్పుణ్యరాత్ర చతుర్థయామంబున.

         *          *         *        *         *

కీ. తెలు గదేలయన్న దేశంబు తెలు గేను

దెలుగువల్లభుండ దెలుగొకొండ

యెల్లనృపులు గొలువ నెఱుగనే బా పాడి

దేశభాషలందు దెలుగు లెస్స.


క. అంకితమో యన నీ కల

వేంకటపతి యిష్ట మైనవే ల్పగుట దదీ

యాంకితము చేయు మొక్కొక

సంకేతము కా కతడె రస న్నే గానే.

కళింగదేశ విజయయాత్ర కయి వెడలి విజయవాటి (బెజవాడ) కి వచ్చినది హూణశకము 1515 వ సంవత్సర మగుటచేత రాజీగ్రంథము నాసంవత్సరమునందు జేయనుద్దేశించి ప్రారంభించియుండును. అయినను నుదహరించిన యుపోద్ఘాతములోని "అలుకన్‌ఘోటక" ఇత్యాది పద్యమునందు వర్ణింపబడిన (1520 వ సంవత్సరమునందు జరిగిన) యేడిల్ఖా