పుట:AndhraKavulaCharitamuVol2.pdf/257

ఈ పుట ఆమోదించబడ్డది

యణములోనివి ప్రతికాండమునుండియు రెండేసి పద్యముల నిందుదాహరించుచున్నాను-


చ. బిరుదులజల్లులున్ బునుగుబిల్లులపిల్లలు నుల్లసద్గతిం
   బరగెడు మేలిమూలికలవల్లులు వీక్షణపర్వకారిబం
   ధురమృగరాణ్మతల్లులు వినూత్నతరంబులు కొల్లలై తగన్
   నరవిని గాన్క లిచ్చి మహిజానికి నిట్లని రందఱుం దగన్. [బాలకాండము]


శా. దేహం బస్థిర మెల్లవారలకు ధాత్రీభాగమం దేల యి
   ట్లూహాపోహలు చేయ నీతనికి ము న్నుత్సాహియై యిత్తునం
   చాహాపల్కితి వి స్డబద్దములు పెక్కాడంగ యుక్తంబులౌ
   నా హేయాంగము దీని నమ్మి యిటు లేలా దబ్బఱ ల్పల్కగన్. [బాలకాండము]


మ. భరతుం డెవ్వడు కైక యెవ్వతె ధరాపాలుండు తా నేమి త
    ద్వరయుగ్మం బన నేది నానిశితతీవ్రస్ఫారఖడ్గంబుచే
    భరతుం ద్రుంచి ధరాస్ధలంబునకు నిన్ బట్టంబు నే గట్టెదన్
    ధరణీమండలి నెల్లమానవులు మోదం బూని కీర్తింపగన్. [అయోధ్యాకాండము]


మ. నిను మన్నించి మదాత్మజున్ రఘువరన్ నేనిట్లు కోల్పోయితిన్
    నిను బెండ్లాడి సమస్తభూమిజనము ల్నీచాత్ము డీతం డనం
    గ నవేలంబగునింద వర్తిలితి గైకా సూర్యవంశంబు నీ
    దునిమిత్తంబున నెన్నిభంగుల జెడెన్ దోషంబు నిన్ జూడగన్. [అయోధ్యాకాండము]


ఉ. ఉత్తములైనరాజవరు లుద్ధుర బాణకృపాణచాపముల్
   హత్తి ధరించు టెల్ల సభయాత్మకులై శరణన్నవారి ను
   ద్యత్తరలీల గావగ రణాంగణమం దెదిరించినట్టియు
   న్మత్తరిపుప్రకాండముల మర్దనచేయగ గాదె యెన్నగన్. [అరణ్యకాండము]