పుట:AndhraKavulaCharitamuVol2.pdf/239

ఈ పుట ఆమోదించబడ్డది

   గలి కేతెంచితి రీప్సితార్థములు వీక న్మీకు నర్పించి మీ
   వలనన్ దీవన లందినన్ భువనము ల్వర్ణింపవే కావునన్. [ఆ.2]


శా. ఉద్వేలప్రళయాబ్ధులో యనగ నత్యుద్రేకమానంబులై
   విద్వద్వర్యుని గుంభ సంభవు మహావిర్భావధైర్యున్ మనం
   బుద్విగ్నంబుగ బట్టి కట్టుటకు నిట్లొక్కుమ్మడిన్‌డాయ భా
   స్వద్విఖ్యాతుల నాత్మసైన్యముల హస్తం బెత్తి మాన్చెన్వడిన్. [ఆ.3]


చ. ఇవిరె గొలంకు లాపగలు నింకుచు గాల్నడ లయ్యె వేండ్రమై
   పవనము వీచె భూజములపత్రము లన్నియు నూడె జీవజం
   తువులు తపించె లోకులకు దోచె విదాహము లక్క డక్కడన్
   దవము జనించె శైలముల దాసె తనంతట మండువేసవిన్. [ఆ.4]


చ. వరద శరణ్య నీవు వనవాసము చేయుచు నేగుదెంచి నా
   చరణము లంటి మ్రొక్కిన బ్రసన్నత గైకొని ధన్యు నిన్ను భూ
   వరు డని యుంటిగాని పరవస్తు వటంచు నెఱుంగనైతి నా
   యెఱుగమి సైపవే తెలియనెవ్వడ నీఘనమాయ నచ్యుతా. [ఆ.5]


48. లింగమగుంట తిమ్మన్న


ఈకవి సులక్షణసార మనుగ్రంథమును రచియించెను. ఇతడు యజ్ఞవల్క్యబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; లక్ష్మయ్యకును తిమ్మాంబకును పుత్రుడు. ఈకవి యించుమించుగా తెనాలిరామకృష్ణ కవితో సమకాలికుడు. ఇతడు తనకు భట్టరు చిక్కాచార్యుడు గురు వైన ట్లీక్రిందిపద్యమున వ్రాసికొని యున్నాడు -


సీ. శ్రీవైష్ణవహితుండ జిక్కయభట్టరుశిష్యుడ గవితావిశేష శేష
   తులితసర్వార్యుపౌత్రుడ లక్ష్మణయకు దిమ్మాంబకు సుతుడ బెద్దనకు మార