పుట:AndhraKavulaCharitamuVol2.pdf/232

ఈ పుట ఆమోదించబడ్డది

   నంకితంబుగ గాళికాంబాప్రసాద
   సంకల్పితకవిత్వచాతుర్యధుర్య
   యావీరపెదలింగనార్యతనూజ
   కోవిదస్తవనీయగుణ రుద్రధీర
   విరచితసుగ్రీవ విజయాభిధాన
   గరిమ భాసిలు యక్షగానప్రబంధ
   మాచక్రవాళశైలావనియందు
   నాచంద్రతారార్కమై యొప్పుగాత!

ఈగ్రంథము కవియొక్క ప్రథమకవిత్వ మగుటచే నంతరసవంతముగా నుండకపోయినను, ఇందుండియు రెండుపద్యముల నుదాహరించుచున్నాను.



గీ. అనిన విని రాఘవేశ్వరుం డలరి నవ్వు
   మొలక మొగమున జిగు రొత్త నిలిచి పాద
   వనరుహాంగుష్ఠమున జిమ్మె దనుజవరుని
   సముదితాంగంబు పదియోజనములు పడగ.


క. తారాదిసతులశోకము
   వారిచి కుమారు దేర్చి వాలికి బరలో
   కారోహణాదిసత్ర్కియ
   లారవితనయుండు రామునానతి జేసెన్.