పుట:AndhraKavulaCharitamuVol2.pdf/226

ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. తప్పక చూచు ను గ్గనుచు దాదులు పల్కిన గేరినవ్వు మా
   యప్పురొ నిద్ర పొమ్మనిన నల్లన బారలు చాచు జేతులం
   జప్పటిచేయ జేరి విను సారెకు నత్తయటంచు బల్కు నా
   యొప్పులబాలు డంత ముద మొందుచుచు దల్లియు దండ్రి కన్గొనన్. పూర్వ.

చ. కమలదళాక్ష నీవు ననుగానక తక్కిన నిప్పు డిందిరా
   రమణికి విన్నవింతు ననురాగము తండ్రికి గల్గకున్న చో
   దమి నిజపుత్రులందు దయ తల్లికి గల్గక సోవ దంతటం
   గమల మదర్థమై కినుక గాంచును నీపయి జాటిచెప్పితిన్ - పూర్వ.

ఉ. లేమలమీదిప్రేమ లవలేశము వీడవు దానధర్మముల్
   నేనుముతో నొనర్ప గను లెక్క యొనర్పవు శ్రీరమాధవున్
   బ్రేమముతో దలంపగను రేయిబగళ్ళును బూన వూరకే
   పామర మొందు చీ వితరపద్ధతి గోరెదవేమి కామమూ - ఉత్తరభా.


43. కంసాలి రుద్రయ్య


కృష్ణదేవరాయనికాలములో గంసాలి భద్రయ్యయని యొకస్వర్ణకారకవి యుండెననియు, అతడు రాయలయాస్థానమునందుండిన అష్టదిగ్గజములలో నొకడనియు కొందఱు వ్రాసియున్నారు. అతడు సరస మనోరంజనమను ప్రబంధము రచియించెనని కొందఱు చెప్పుదురుగాని యాగ్రంథ మిప్పు డెక్కడను గానరాకున్నది. సరసజనమనోరంజనము లోనిదని బ్రౌన్‌దొరవారి ఛందస్సునం దీక్రిందిపద్య ముదాహరింపబడి యున్నది -



ఉ. ఎన్నడు నేరిచెన్ బెళుకు లీచెలికన్నులు, కారుకమ్ముల
   న్నన్న కురుల్, పిఱుందు బటువై పటువైఖరి గై కొనెంగదే,