పుట:AndhraKavulaCharitamuVol2.pdf/199

ఈ పుట ఆమోదించబడ్డది

యడుగుదమ్ముల కెరగి నెయ్యంబుతోడ
రంభ యిట్లను సంభ్రమారంభ యగుచు- [ఆ.3]

ఉ. హారము భారమై మణిగణాకరబంధురసౌధరంగసం
చారము దూరమై తనువుసంగతి నొప్పెడుచందనాదిశృం
గారము క్రూరమై చెలియకై వడి నెమ్మియొనర్చినట్టిరా
కీరము వైరమై నిగిడె గేసరిమధ్యకు నొక్క పెట్టునన్. [ఆ.5]

శా. ఏమేమీ హరి శూరుడంటి నిజమౌనే యాజరాసంధు డు
ద్దామప్రక్రియ జుట్టుకొన్న బురమున్ దర్పంబు డించెన్ సమి
త్సీమం దా యవనుండు త్రోల గుహ జొచ్చెం జూడగా నిన్న గా
దా ముంజేతులకంకణంబులకు నద్దం బేల యక్రూరకా. [ఆ.6]

మ. హరితో నీధరణీవరాగ్రణికినై యాయోధనక్రీడకున్
బురికొంటి న్వడి నేడు మేనులు తృణంబుల్గా విచారించి వీ
రరసోద్రిక్త మనస్కులై మెఱయవార ల్నిల్వు డాత్మన్ శరీ
రరతిం జెందినభూవరుల్ చనుడు పుత్రభ్రాతృసంయుక్తులై. [ఆ.7]


35. సారంగు తమ్మయ్య


ఈప్రాంతములయందు సారంగువారు సాధారణముగా మాధ్వులుగా నున్నారు. ఈకవి తనవంశమును వర్ణించుచు,


ఉ. త మ్మనయంబు బ్రోచుటకు ధారుణిబంధులు బంధుపారిజా
త మ్మన రామభక్తి గలతార్కికు లెల్లను వీనిదౌర చి
త్త మ్మన జూపులం దనిసి ధార్మికు లీతని దెంతమంచివృ
త్త మ్మన నాగిరిప్రభునితమ్మన మించె నుదంచితస్థితిన్.