పుట:AndhraKavulaCharitamuVol2.pdf/183

ఈ పుట ఆమోదించబడ్డది

జడిపించి తరువాత నిజమును జెప్పి రాజుచే మన్నింపబడి బహుమానముల నందెననియు మఱియొక కథగలదు.


ఇట్లే యిత డనేకకవులను విద్వాంసులనుగూడ నాక్షేపించిన పెక్కుకథలుగలవు. అవి యెంతవఱకు సత్యములో చెప్పజాలము. అయినను వానిలో గొన్ని సత్యములు కావనియు నిటీవలి కాలమున గల్పింపబడినవనియు మనము సులభముగా నూహింపవచ్చును. ఇతడు రచియించినపాండురంగ మాహాత్మ్యకృతికి నాయకుడగు వేదాద్రి---- గురువైన కందాళ అప్పలాచార్యులువారు సభకు వచ్చునప్పుడు వ్యాకరణశాస్త్రమునందలి యాయనపాండిత్యప్రకర్షమును శ్లాఘించిన నొకశిష్యుడు,


శ్లో. "అపశబ్దభయం నాస్తి| అప్పలాచార్యసన్నిధౌ"


అని చెప్పగా రామకృష్ణుడు,

"అనాచారభయం నాస్తి |తిష్ఠన్మూత్రస్యసన్నిధౌ"


అని శ్లోకపూర్తిచేసి పరిహసించెనని చెప్పుదురు. దీనిని తెలుగించినచో శిష్యుడు చేసిన శ్లోకముయొక్క పూర్వార్థము


గీ. "అప్పలాచార్యసన్నిధియందు (వీస

మంతయిన)నపశబ్దభయంబు లేదు"

అనియు, దానిని పూరించిన రామకృష్ణునియొక్క యుత్త----

"నిలిచి మూత్రవిసర్జన సలుపువాని

వద్ద (గూడ) ననాచారభయము లేదు"


అనియు నగును. శబ్దశాస్త్ర పాండిత్యమునుబట్టి యెట్టి శబ్దము నైన సుశబ్దమునుగా సాధింపగల సామర్థ్యముగల తన--వద్ద నెవ్వరును నపశబ్దమునకు భయపడవలసిన యక్కఱలేదని --వచ్చునట్లు శిష్యుడు శ్లాఘించినప్పుడు నిలుచుండి మూత్రము---