పుట:AndhraKavulaCharitamuVol2.pdf/181

ఈ పుట ఆమోదించబడ్డది

నను, ఏవో కొంటెపనులు చేయుచువచ్చి పలుమాఱు రాజుల యాగ్రహమునకు పాత్రు డగుచు వచ్చెనట! ఇందు గొంతసత్య ముండకపోదు. అట్లుకానియెడల నితడు తనగ్రంథములను పేరుగలరాజుల కెవ్వరికి నంకితము చేయక యొకవ్రాయసగాని కంకితము చేయుట తటస్థించి యుండదు. మహమ్మదీయుల దాడిచేత పేరుగల హిందూరాజ్యములు నశింపంగా ధనసంపన్నుడుగాని రామకృష్ణకవి స్వకుటుంబపోషణార్థమయి ధనస్వీకారముచేసి తనగ్రంథమును సంగరాజుజాగీరులోని విరూరి కరణమున కంకితము చేసినను చేసియుండవచ్చును. కృతిపతి యయిన వేదాద్రికి వాసస్థానముగా నుండినవిరూరు నెల్లూరుమండలములో పినాకినీనదికి వంతెనగట్టదలచిన సంగమునకు రెండు క్రోసులదూరమున నున్నది.

రామకృష్ణుడు చేసినయపరాధములను దెలిపెడుకథలలో నొకటి రెంటి నిందుదాహరించుచున్నాను.

ఒకప్పు డితడు రాజగురు వయిన తాతాచార్యులవిషయమున చెప్పరాని మహాపరాధమును జేసినందున, రాజు దురాగ్రహగ్రస్తుడై యీతనిని తలవఱకు భూమిలో పాతిపెట్టి యేనుగుచేత తల త్రొక్కింపుడని రాజభటుల కాజ్ఞ యిచ్చెనట. రాజభటు లాతనిని గొనిపోయి యూరిబయలను కంఠములోతు మంటిలో పాతిపెట్టి, త్రొక్కించుటకొఱ కేనుగును దీసికొనివచ్చుటకై వెళ్ళిరట. ఈలోపల గూనిచాకలి వాడొక డామార్గమున బోవుచు రామకృష్ణుని జూచి యిది యేమని యడుగగా, అతడు తనకు సంభవించిన గూను పోగొట్టుకొనుట కయి వైద్యులయాజ్ఞ చొప్పున దా నీచికిత్సను జేయించుకొనుచున్నా ననియు గూను పోయినదో లేదో పయికితీసి చూడవలసిన దనియు వానితో జెప్పెనట. వా డాప్రకారముగా జేసి యాతనికి గూను లేకుండుట కద్భుతబడి తన కాచికిత్స చేయమని కోరగా, రామకృష్ణుడు వానిని