పుట:AndhraKavulaCharitamuVol2.pdf/176

ఈ పుట ఆమోదించబడ్డది

భూపాలునికంటె నేబదియేండ్లు చిన్నవాడగుట యసంభవము కానేరదు. రెట్టమతమునందు కృతిపతియొక్క విక్రమధురంధరులైన యేడుగురు కొడుకులు వర్ణింపబడుటయేకాక కృతిపతియొక్క కొడగొట్టు తమ్మునిపుత్రులుసహిత మేవురు బాహుబలశాలులయి నట్లు వర్ణింపబడియున్నారు. అందుచేత నతడీగ్రంథమును గృతినందినకాలమున కనగా 1769 వ సంవత్సరమునాటికి మిక్కిలి వృద్ధు డయి యుండవలెను. అతని కప్పు డెనుబదిసంవత్సరములవయ స్సుండె ననుకొందము. అట్లనుకొన్నను పాండురంగమాహాత్మ్యము రచియింపబడినకాలము 1650 వ సంవత్సరమునకంటె బూర్వమయి యుండదు. అప్పటికి రామకృష్ణుడు వృద్ధు డనుకొన్నను, అతడు కృష్ణదేవరాయల యాస్థానమునందలి కవుల నాక్షేపించె నన్న కథలన్నియు నసత్యకల్పనములనుట స్పష్టము. అయినను మన మీకవులకాలమునుగూర్చి యింకను విచారింపవలసి యున్నది.

ఈరామకృష్ణకవి యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు; కౌండిన్యసగోత్రుడు; తండ్రి రామయ్య; తల్లి లక్ష్మమ్మ. తాను తెనాల్యగ్రహారనిర్ణేత యయినట్టును, ఆశుకవిత్వాదులయందు మేటియైనట్టును, కృతిపతి తన్నుద్దేశించి పలికినట్టుగా కవియే పాండురంగమహాత్మ్యమునం దీక్రింది పద్యములతో జెప్పుకొనియున్నాడు.


క. నను రామకృష్ణకవి గవి

జనసహకారావళీవసంతోత్సవసూ

క్తినిధి బిలిపించి యర్హా

సనమున గూర్చుండ బనిచి చతురత ననియెన్.


సీ. నలుదెఱంగులకావ్యనవసుధాధారలఘనుడనాశువునందుగరముమేటి

వఖిలభూమీపాలకాస్థానకమలాకరోచ్చయతరుణసూర్యోదయుడవు