పుట:AndhraKavulaCharitamuVol2.pdf/166

ఈ పుట ఆమోదించబడ్డది

ములను జేసి యుండవచ్చును. ఒకవేళ నీయిద్దరిలో నొకరు రెండవ వాని కావ్యమును జూచి తరువాత దనపుస్తకమును జేసియు నుండవచ్చును. ఈయంశమును దీనిం జదువువారు నిర్ధారణ చేసికొన గలుగుట కయి యించుమించుగా శంకరకవి గ్రంథములోనుండి యుదాహరించిన పద్యముల యర్థము నిచ్చెడు పద్యములనే యిందుదాహరించు చున్నాను-


చ. ఉరుతరసత్యవాక్యవినయోచితభూరిగుణప్రసిద్ధికిన్

నరపతు లేమిలెక్క పదునాలుగులోకములయందు జూడ గి

న్నరసురయక్షకింపురషనాయకులం దొక డైన లేడు ని

ర్భరమహితప్రభావమున బన్నిద మిత్తు బురారిసన్నిధిన్. [ఆ.1]


ఉ. మానవనాథ యీకొఱత మాటల దీఱదు గాధినూను డీ

పూనిక దప్ప డింక గొనిపోయిరె మున్ను ధరిత్రి చేరెడం

తైన నర్తేంద్రముఖ్యులు దివాకరవంశ పయోధిచంద్ర నీ

మానితవాగ్వదాన్యమహిమం బెడబాయు టదేమి చూడగన్. [ఆ.2]


చ. ధృతిమెఱయంగ నే నిటుపతివ్రత నేని, ధరిత్రిమీద మ

త్పతిఘనసత్యవాక్యనయభాసుర డేని కృశాన నీ విదే

హితమతి శీతలాకృతి వహించి ధరామరవర్యు భూవిభున్

సుతు డగులోహితాస్యు దయజూచి మునీంద్రుఋణంబుదీర్పుమా. [ఆ.2]


ఉ. ఏమనవచ్చు మున్ను ధరయేలినరాజులదేవులెల్ల స

త్కామవినోదవైభవసుఖప్రదలై నసియింప, నిన్ను బల్

బాముల గప్పి కాఱడవిపాలుగ ద్రిప్పి కృతఘ్న బుద్ధిచే

నీమము దప్పి యమ్ముకొన నేరుపు గల్గె లతాంగి యేమనన్. [అ.4]