పుట:AndhraKavulaCharitamuVol2.pdf/159

ఈ పుట ఆమోదించబడ్డది

సీ. నిర్మించె నేమంత్రి నిరుపమప్రాకారనవకంబుగా గోపినాధపురమును

గెలిచినా డేమంత్రి లలితవిక్రమమమునబ్రబలుడై యవనులబలము

నిలిపినా డేమంత్రి నియత వైభవమున గోపికావల్లభు గూర్మివెలయ

బాలించె నేమంత్రి ప్రకటధర్మఖ్యాతి మహిమమీఱగ నాంధ్ర దేశ మందు.


నతడు భూపాలమంత్రీంద్రసతతవినుత

ధీవిశారదు డచ్యుతదేవరాయ

మాన్యహితవర్తనుడు శౌర్యమహితయశుడు

భానుతేజుండు రామయభాస్కరుండు.


దీనినిబట్టి రావిపాటి తిప్పరాజు1540 వ సంవత్సరప్రాంతమున యందుండెననుట స్పష్టము. ఈరావిపాటి తిప్పరాజును స్తోత్రమ-- యెఱ్ఱనకవి యాతని కాలమునందో తరువాతనో యుండియుండవచ్చును. కొక్కోకమును రచించిన కొన్ని సంవత్సరముల కీయెఱ్ఱనకవి సకల నీతి కథావిధానమును రచించి కొక్కోక కృతిపతియైన మల్లామాత్యుని యన్నకొడుకగు కుంటముక్కల పినభైరవామాత్యున కంకితము చేసి నందున గవి 1560-70 సంవత్సరప్రాంతములయం దుండెనని చెప్ప వచ్చును. సకలనీతికథా నిధానములో గృతిపతి కవినిగూర్చి చెప్పినట్లున్న యీక్రింది పద్యములు పయియంశమును తెలుపుడు---చున్నవి.


సీ. శ్రీవత్సగోత్రవారిధిపూర్ణశీతాంశు డగుకూచమంత్రికి నాత్మజుండు

వివిధాష్టభాషాకవిత్వవాచాప్రౌడి బూర్వకవీంద్రుల బోలిన

వఖిలపురాణేతిహాసకావ్యస్మృతిచయము రచించినచారుమతి

మాపినతండ్రియౌమల్లమంత్రికిని గొక్కోకంబు చెప్పినకోవిదుండు

రసికు లభిమతిచేత బురాణసార | మనుపమంబుగ నాకిచ్చి

వట్లుగావున నొకటి నిన్నడుగదలచి|యిచ్చటికి బిల్వబంచితినెఱ్ఱనామాత్యుని