పుట:AndhraKavulaCharitamuVol2.pdf/151

ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. పోరుల నారువీటిపురబుక్కయరామనృపాలు డాగ్రహో

దారత వాలు పూనిన సదాగతికంపితజీర్ణ వర్ణ లీ

లారభటిన్ విరోధిమహిళాంగవిభూషణరాజీరాలు దై

వారు బ్రతాపవల్లవశుభప్రభ వర్ధిలు గీర్తిపుష్పముల్


మ. దివిజేంద్రాభుడు కృష్ణరాయధరణీదేవేంద్రుజామాత శ్రీ

ధవపాదాంబుజబంభరం బమరు మేధా వేధ రామప్ప శా

త్రవకంఠాంతరరక్తశీకరసమిద్ధారోర్మినిర్ధౌతఖ

డ్గవనీకీర్తిలతాంతగంధిలహరిత్కాంతాకచాభోగు డై


క్షత్రియవంశజు డైన యీకవి యాపస్తంబసూత్రుడు; ఆత్రేయ గోత్రుడు; తిరుమల శ్రీనివాసాచార్యశిష్యుడు. ఈతనిది సలక్షణమై నిరర్గళధార గల మంచికవిత్వము. కవనరీతి తెలియుట కయి సాంబోపాఖ్యానములోనిపద్యముల గొన్నిటి నిం దుదాహరించుచున్నాను-


చ. పరమజ్ఞానిహృదంతరాళమణిదీపంబుల్ నమస్నాగకి

న్నరనక్తంచరనాక నాయకశిరోనాళీకరాగప్రభాం

కురనీరాజితముల్ నిజాంఘ్రితలముల్ గోపాలబాలుండు ని

ల్పె రటద్గోఖుర ధూలీ ధోరణుల నాబృందావనక్వ్ క్షీనులన్


ల్పె రటద్గోఖురధూళిధోరణుల నాబృందావనక్షోణులన్. [ఆ.1]

ఉ. వల్లవవల్లభుండు చెలువల్జలమాడగ దత్కటీతటీ

పల్లవముల్ హరించి తను బ్రార్థనచేసిన నీక నవ్వు నా

పల్ల తికాలవిత్రమయి పాండవపత్నికి నెట్టు లిచ్చెనో


చుల్లర వెట్టుప్రల్ల దపుజూదరి సిగ్గుపడం బటావళిన్. [ఆ.1]

శా. అనియమంబు నాయమము నాదమ మాశమ మానిరంతర

ధ్యానవిధాన మాబహువిధానబంధవిదగ్ధభావ మా

మానస మెందునున్ జననిమట్టును గుట్టును మౌను లౌననం


గా నత డొప్పు భక్తికలికాకిలికించితబోధమాధురిన్. [ఆ.2]