పుట:AndhraKavulaCharitamuVol2.pdf/141

ఈ పుట ఆమోదించబడ్డది

వసుచరిత్రములోని యీ క్రిందిపద్యములో వేంకటపతి రాజధానిని చంద్రగిరికి మార్చినసంగతి సూచించియున్నాడు-

మ. హరు డాతారకశైలదుర్గమున నధ్యాసీనుడై రాజశే

ఖరవిఖ్యాతి వహించు జందగిరిదుర్గంబందు శ్రీవేంకటే

శ్వరు డొప్పెన్, బహురాజశేఖరసదాసంసేవ్యుడై యౌర యి

ద్ధర బంటేలికవాసి తద్గిరులకున్ దద్వల్లభశ్రీలకున్


ఈపద్యముల నన్నిటిని బట్టి చూడగా వసుచరిత్రము 1577 వ సంవత్సరము తరువాతనే ముగింపబడినట్టు స్పష్ట మగుచున్నది. తిరుమలరాయ డేసంవత్సరమునందు మృతినొందెనో స్పష్టముగా దెలియదుగాని 1574 వ సంవత్సరమువఱకును నాత డిచ్చిన దానశాసనములు కనబడుచున్నవి; 1574 వ సంవత్సరము మొదలుకొని 1585 వ సంవత్సరమువఱకును అతని రెండవకొడు కయిన శ్రీరంగరాజు దానశాసనములును, 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును మూడవకొడు కయిన వేంకటపతియొక్క దానశాసనములును కానవచ్చుచున్నవి. తిరుమలదేవరాయడు 1574 వ సంవత్సరమునకు దరువాత రాజ్యభారమునంతను పూర్ణముగా కొడుకుల కప్పగించి తాను విద్వద్గోష్ఠితో ప్రొద్దుపుచ్చుచుండి యుండవచ్చును. 1577 వ సంవత్సరమునందు ఆలీఅడిల్‌షా తిరుమలదేవరాయని పెనుగొండనుండి చంద్రగిరికి పాఱదోలినట్టు మహమ్మదీయులు వ్రాసినచరిత్రమునందున్నది. దీనినిబట్టిచూడగా తిరుమలదేవరాయడు 1577 వ సంవత్సరమునకు దరువాతకూడ గొంతకాలము జీవించియున్నట్టు తోచుచున్నది. రామరాజభూషణుడు తిరుమలరాయనికి వసుచరిత్రము నంకితము చేయునపుడు తెనాలిరామకృష్ణు డక్కడకు వచ్చి "శ్రీభూపుత్రి" యని మొదటిపద్యమును జదువ నారంభింపగానే పకపకనవ్వి యీకృతి చదువుటతోనే శ్రీపోయెనని గేలిచేసె ననియు, అదియెట్లని సభవా రడు