పుట:AndhraKavulaCharitamuVol2.pdf/137

ఈ పుట ఆమోదించబడ్డది

1. గీ. తా రచించిన వసుచరిత్రమున గన్న

తండ్రి సూరన వెలయించి తలప డయ్యె

నన్ను మన శారదామూర్తి నాఫలంబె

దత్తు డగువాని జేపట్టదరమె నాకు.


అను చాటుధారాపద మొకటి రామరాజభూషణుడు తన వసుచరిత్రములో జనకపితయైన సూరపురాజు పేరుదాహరించి తన్ను బేర్కొనకపోవుటచేత పాలకపితయైన వేంకటరాయభూషణునిచే జెప్ప బడినదని వాడుకలోనున్నది.

2. చతుర్భుజాభిషేకము, యావనచరిత్రము, గంగాగౌరీసంవాదము అను ప్రబంధములను రచించి ప్రసిద్ధుడయి వసుచరిత్రమునకు వ్యాఖ్యానముచేసిన సోమనాథకవి గ్రంధాదిపీఠికలో నిట్లు వ్రాసి యున్నాడు-

శా. ఈరీతిం గవితావితానవృతగౌరీశానమౌళిస్థలో

దారోద్దేశుడ నైననాకు వెస విద్యావంతు లెల్లన్మనో

హారప్రక్రియ మూర్తిచేత రచితంబై విశ్రుతంబౌ వసు

క్ష్మారాట్చిత్రచరిత్రటీక కయి యుత్సాహంబు పుట్టించినన్.


ఉ. కారణజన్ముడై కవినికాయము మెచ్చగ గావ్యకర్తయై

భూరికళాకలాపు డయి పొల్పువహించెడు బట్టుమూర్తిచే

నీరితమై సుఖారపదహీనపదాస్పద మైన యావసు

క్ష్మారమణప్రవృత్తము సుసాథ్యముకాదు తలంచిచూడగన్.


అని యిందలి మొదటిపద్యములో వసుచరిత్రము "మూర్తి" చేత రచిత మనియు, రెండవ పద్యములో "బట్టుమూర్తిచే నీరిత" మైనదనియు, వ్యాఖ్యాత చెప్పియున్నాడు. ఈ వ్యాఖ్యాత యేకాలమునందుండిన వాడో సరిగా తెలియదుగాని, అప్పటి కవికిని నహోబలపతికిని దరువాత నత్యల్పకాలములోనె పదునేడవ శతాబ్దాంతమున నున్నట్లు తెలియ