పుట:AndhraKavulaCharitamuVol2.pdf/122

ఈ పుట ఆమోదించబడ్డది

పింగళిసూరన్న గిరిజాకళ్యాణములోని దని యీక్రిందిపద్యము రంగరాట్ఛందస్సులో నుదాహరింపబడి యున్నదిగాని యీపుస్తకము నాకు లభించలేదు.


క. కోపాటోపంబున ధర * ణీపాలకచంద్రముడు మునిశిఖామణులన్

ద్రోపించిన వారు దురా * లాపము లాడుచు బోయి రాసమయమునన్.


20. అద్దంకి గంగాధరకవి.

ఈ గంగాధరకవి నియోగిబ్రాహ్మణుడు; వీరనామాత్యుని పుత్రుడు. ఇతడు గోలకొండ నబాబైన ముల్కిభరాము (ఇబ్రహీమ్‌ మల్కు) వద్ద నాస్థానకవీశ్వరుడుగా నుండెను. యయాతిచరిత్రమును రచియించిన పొన్నికంటి తెలగనార్యుడుగాక తనగ్రంథమును మహమ్మదీయుల కంకితముచేసిన తెలుగుకవి యీత డొక్కడే యైనట్లు కానబడుచున్నాడు. ఈకవి రచియించిన గ్రంథములలో ముఖ్యమైనది తపతీ సంవరణ మను శృంగారప్రబంధము. ఈగ్రంథమునందు కృతినాయకుడైన మల్నిభరా మీక్రింది రీతిని వర్ణింపబడెను.-


సీ. సకలవేదపురాణశాస్త్రసారగు లైన

యొంటరివిద్వాంసు లొక్కచోట

నష్టభాషలయందు నాంధ్యంబు లేకుండు

హొంతకారికవీంద్రు లొక్కవంక

గజపతి నరపతి క్ష్మాభర్త లంపిన

యొడికంపురాయబా ర్లొక్కదండ

మేరుమందరముల మించగల్గినమన్ని

యులు దండనాథు లొక్కొక్కయెడల

జేరికొల్వ భద్రాసనాసీను డగుచు

రమ్యగుణహారి మల్కి భ రామశౌరి

భారతక్షీరమయసింధుబంధమధ్య

లలిత పుణ్యకథాసుధాలహరి దేలి.