పుట:AndhraKavulaCharitamuVol2.pdf/118

ఈ పుట ఆమోదించబడ్డది

పింగళిసూరన్న కృష్ణదేవరాయనికాలములో నుండెనని యొకానొక రనుచున్నారు. ఆర్వీటి బుక్కరాజు ముమ్మనుమడైన యళియ రామరాజే 1564 వ సంవత్సరమువఱకు నుండినప్పుడు బుక్కరాజు ముమ్మనుమని మనుమడయి కళాపూర్ణోదయ కృతిపతియైన నంద్యాల కృష్ణరా జంతకుబూర్వమునం దుండెననుట పొసగనేర నందున వారిమాట విశ్వాసార్హమయినది కాదు. ఇతడు 1560 వ సంవత్సరమునకు లోపలనుండుట, తటస్థింపదు.

గ్రంధస్థములైన యీ నిదర్శనము లటుండగా మఱియొక కట్టుకథకూడ వాడుకలో నున్నది. ఈ సూరనార్యు డల్లసానిపెద్దన్న మనుమరాలిభర్త యనియు, చిన్నతనములో నితడు చదువులేక మూడుడై తిరుగుచుండుటచూచి యితనినిమాత్రమే కాక యీతని భార్యను సహితము మూడభర్త దొరకెనని యెల్లవారును పరిహసింపుచువచ్చిరనియు, అందుమీద సూరనకు రోషమువచ్చి దేశాంతరముపోయి చదువుకొని పండితుడై వచ్చి రాఘవపాండవీయమును చేయ నారంభించెననియు, అప్పుడా చిన్నది తనభర్తను వెంటబెట్టుకొని తాతగారియొద్దకు బోయి నీ మనుమడు రాఘవపాండవీయమును జేయు చున్నాడని చెప్పగా నతడందులోని పద్యము నొకదానిని చదువుమని యడిగెననియు, అందు మీద సూరన,

"తలపం జొప్పడి యొప్పె నప్పుడు"

అని పద్యమును జదువ నారంభింపగానే యల్లసానిపెద్దన్న "యింతలోనే నాలుగువిఱుపులా" యని యాక్షేపించె ననియు, తరువాత సూరన పై భాగము నందుకొని,

"..............తదుద్యజ్జైత్రయాత్రాసము

త్కలికారింఖదసంఖ్యసంఖ్యజయవత్కంఖాణరింఖావిశృం